GOLD: ప్రతి ఏడాది రూ. 30 వేల కోట్ల నష్టం
భారీగా పెరిగిన పసిడి.. అడ్డదారులు తొక్కుతున్న కేటుగాళ్లు.. యేటా రూ. 30 కోట్ల పన్ను ఎగవేత
బంగారం ధర భారీగా పెరిగిపోయింది చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి బంగారం ధర పెరగడంతో వ్యాపారులు లాభాలను దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని ఇటీవల పలు సందర్భాలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. . ముఖ్యంగా బంగారం భారతదేశంలో ఎక్కువగా దాదాపు 90% పైన దిగుమతి అవుతుంది. మన దేశంలో మైనింగ్ ద్వారా బంగారం ఉత్పత్తి చాలా తక్కువ మొత్తంలో లభిస్తుంది. మన దేశానికి వచ్చే బంగారం దాదాపు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో దిగుమతి అయ్యే బంగారం పైన సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల మన దేశంలో దిగుమతి అయ్యే బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే ఈ పన్నులను తప్పించుకోవడానికి కొంతమంది అక్రమార్కులు స్మగ్లింగ్ పద్ధతులను అవలంబిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అలాగే సంబంధిత శాఖలు ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ గోల్డ్ స్మగ్లింగ్ అనేది భారీగా పెరిగిందని ఒక అధ్యయనం పేర్కొంది. బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో గోల్డ్ స్మగ్లింగ్ దారులు కూడా పెరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు.
విదేశాల నుంచి అందుకే..
విదేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది వ్యాపారులు స్మగ్లర్లు కుమ్మక్కై మన దేశంలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్నారు. . దీనివల్ల కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోతోంది ముఖ్యంగా ఓడరేవులు, విమానాశ్రయాలు, విదేశీ బార్డర్ల ద్వారా బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ మీడియా కథనం ప్రకారం 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాలపై కస్టమ్స్ డ్యూటీ పన్నును తగ్గించడం వల్ల 28 వేల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయిందని ఆ కథనంలో పేర్కొంది. అయితే స్మగ్లింగ్ వల్ల భారతదేశం దాదాపు 30 వేల కోట్ల రూపాయలు విలువైన పన్ను ఆదాయం కోల్పోతోందని ఈ కథనంలో పేర్కొన్నారు. ప్రతి ఏడాది దాదాపు 20,000 నుంచి 30 వేల కోట్ల రూపాయల ఆదాయ నష్టం వస్తుందని, అలాగే దాదాపు 3 టన్నుల బరువున్న బంగారం ప్రతి సంవత్సరం భారతదేశంలోకి అక్రమంగా రారాలి వస్తుందని దీని విలువ దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు. రూపాయి విలువ దెబ్బతినే అవకాశం ఉందని ముఖ్యంగా లీగల్ గా జరిగే దిగుమతులు తగ్గిపోయి అధికారిక చెల్లింపులు తగ్గడంతో విదేశీ వాణిజ్య లోటు పెరుగుతుందని, అలాగే గోల్డ్ జ్యువెలరీ మార్కెట్లో అక్రమ వ్యాపారం పెరుగుతుందని ఈ గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బు నేర కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తారని ఈ కథనంలో పేర్కొన్నారు. ఎక్కువగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు దుబాయ్ ద్వారా అక్రమ రవాణా రూపంలో బంగారం చేరుకుంటుందని, ఈ విషయంలో DRI, కస్టమ్స్ , పోలీసు వ్యవస్థలు ఎంత కష్టపడినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని నిపుణులు సైతం పేర్కొంటున్నారు. మరోవైపు దేశీయ మార్కెట్లలో కూడా బంగారం డిమాండ్ భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారం ఆభరణాల ధరలు తగ్గి వస్తున్నాయి. ధరలు తగ్గడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.