Maruti Fronx : అదుర్స్ అనిపించిన మారుతి ఫ్రాంక్స్.. పిల్లలు, పెద్దల సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. ధర ఎంతంటే ?
Maruti Fronx : భారత మార్కెట్‌లో అత్యధికంగా వాహనాలను విక్రయించే కంపెనీలలో ఒకటైన మారుతి సుజుకి నుంచి వచ్చిన ఒక మోడల్ సేఫ్టీ విషయంలో అద్భుతమైన పనితీరు కనబరిచింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారుకు తాజాగా జరిగిన ఆసియాన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. 77.70 మొత్తం పాయింట్లను సాధించిన ఈ కారు, సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇండోనేషియాలోని ప్లాంట్‌లో తయారైన ఈ మోడల్ టెస్టింగ్ వివరాలు, దానికి లభించిన స్కోరు గురించి వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు తాజాగా ఆసియాన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో పాల్గొని బెస్ట్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఫ్రాంక్స్‌కు మొత్తం 77.70 పాయింట్లతో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ పరీక్షించిన మోడల్ ఇండోనేషియాలోని సుజుకి ప్లాంట్‌లో తయారైంది. టెస్ట్ చేసిన ఫ్రాంక్స్ మోడల్ 1060 కిలోల కర్బ్ వెయిట్‌తో, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడింది. ఈ మోడల్‌ను లావోస్, కంబోడియా, మలేషియా వంటి మార్కెట్‌లలో కూడా విక్రయిస్తున్నారు.
పెద్దల భద్రతలో మెరుగైన స్కోరు: ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 13.74, సైడ్ ఇంపాక్ట్‌లో 8కి 7.63, ట్రెత్ పర్స్పెక్షన్ టెస్ట్‌లో 8కి 8 పాయింట్లు సాధించింది.
పిల్లల భద్రత: ఇన్‌స్టాలేషన్ (12కి 12), సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ (8కి 8) వంటి విభాగాలలో ఫ్రాంక్స్ పూర్తి మార్కులు సాధించడం విశేషం.
ఇండోనేషియా-స్పెక్ సుజుకి ఫ్రాంక్స్ అన్ని వేరియంట్‌లలోనూ స్టాండర్ట్‌గా ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు వెనుక సీట్లలోని ప్రయాణికులకు సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్, పిల్లల సీట్ల కోసం ISOFIX వంటివి ఉన్నాయి. ఈ కాంపాక్ట్ క్రాసోవర్‌లో ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే కొన్ని ఫీచర్లు మలేషియా-స్పెక్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 5-స్టార్ రేటింగ్ సాధించడం ద్వారా మారుతి ఫ్రాంక్స్ ఇప్పుడు మార్కెట్‌లో తన ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన టాటా నెక్సాన్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.