Cooking Oil : భగ్గుమంటున్న వంట నూనెల ధరలు.. రూ. 200 దాటిన సన్ ఫ్లవర్ ఆయిల్..!
Cooking Oil : వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. అందులోనూ సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రోజురోజుకూ పెరుగుతోంది.;
Cooking Oil : వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. అందులోనూ సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సామాన్యులకు అందనంత దూరంగా పరుగులు పెడుతోంది. ముడి సరుకు రవాణా నిలిచిపోవడంతోనే రేట్లు పెరుగుతున్నాయని విజయ ఆయిల్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయిల్ రేట్లు పెరగడమే కాకుండా.. కల్తీ ఆయిల్ కూడా మార్కెట్‌లోకి వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇక అటు వంట గ్యాస్ సిలిండర్ ధర వెయ్యికి చేరిపోయింది. దీనితో మధ్య తరగతి వర్గాల గుండెల్లో గుదిబండ పడింది. గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 50 రూపాయలు పెంచేయడంతో గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పొయ్యి ఎలా వెలిగించాలంటూ ప్రశ్నిస్తున్నారు.