DARK PATTERNS: డార్క్‌ పాటర్న్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

మోసపూరిత పద్ధతులకే డార్క్ పాటర్న్స్ అని పేరు.. వీటిపైకేంద్రం కీలక ఆదేశాలు;

Update: 2025-06-10 04:30 GMT

ఇంటర్నెట్‌ షాపింగ్‌లో మీరు ఓ వస్తువు ధరను చూసి ఆశ్చర్యపోయి, ఆఫర్‌తో మరింత చౌకగా వస్తుందని భావించి ఆర్డర్ పెట్టారు. కానీ చివరికి మీరు ఆ వస్తువు నిజంగా కావాలా లేదా అనేది ఆలోచించకుండానే కొనేసారు! ఇది యాదృచ్ఛికం కాదు – ఇదే డిజిటల్ మోసం. ఇలాంటి మోసపూరిత పద్ధతులకే డార్క్ పాటర్న్స్ అని పేరు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేసి అవసరం లేని వస్తువులను కొనిపించే ఈ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

డార్క్‌ పాటర్న్స్ అంటే ఏమిటి?

డార్క్ పాటర్న్స్ అనేవి వినియోగదారుల నిర్ణయాలను చక్కబెట్టేలా రూపొందించిన చక్కటి మోసపూరిత వ్యూహాలు. ముఖ్యంగా ఈ పద్ధతులు వినియోగదారులపై మానసిక ఒత్తిడిని పెంచి, వారిని అధికంగా లేదా అవసరం లేని షాపింగ్ చేయించేలా ప్రేరేపిస్తాయి. CCPA ఇప్పటివరకు 13 రకాల డార్క్ పాటర్న్స్‌ను గుర్తించింది.

కేంద్రం ఆదేశాలేంటి?

సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఇటీవల ఇ-కామర్స్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం:

వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఉంటే, వాటిని గుర్తించి స్వయంగా తొలగించాలి.

మూడు నెలల లోగా ఈ ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలి.

తమ ప్లాట్‌ఫామ్‌ అనైతిక వాణిజ్య పద్ధతులకు వేదికగా మారిందా అనే విషయాన్ని సంస్థలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కొన్ని సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు CCPA తెలిపింది. అయితే ఆ కంపెనీల పేర్లను మాత్రం వెల్లడించలేదు.

ధాన డార్క్ పాటర్న్స్ తీరులు:

ఫాల్స్ అర్జెన్సీ: “ఇప్పుడు ఆర్డర్ పెట్టకపోతే ఆఫర్ మిస్ అవుతారు” అని చూపిస్తూ తప్పుడు అత్యవసరత సృష్టించడం.

బాస్కెట్ స్నీకింగ్: వినియోగదారుడి అనుమతి లేకుండా షాపింగ్ కార్ట్‌లో అదనపు వస్తువులు లేదా చారిటీ ఛార్జీలను చేర్చడం.

సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్: సబ్‌స్క్రిప్షన్ తీసుకునే ప్రక్రియ సులభంగా ఉండగా, దాన్ని రద్దు చేయడం క్లిష్టంగా ఉండేలా చేయడం.

Tags:    

Similar News