DIGITAL GOLD: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి మంచిదేనా..?

డిజిటల్‌ గోల్డ్‌ SEBI నియంత్రిత ప్రొడక్ట్ కాదు... ప్లాట్‌ఫామ్ మూతబడితే మదుపరులకు రక్షణ లేదు.. SEBI రక్షణ వ్యవస్థ వర్తించదు

Update: 2025-11-23 07:30 GMT

రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో, సంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్ గోల్డ్‌ వైపు కూడా మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇటీవల డిజిటల్ మోసాలు పెరగడంతో, సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టే విషయంలో మదుపరులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, తమ పెట్టుబడులను కొనసాగించాలా లేక ఉపసంహరించుకోవాలా అనే డైలమాలో మదుపరులు పడ్డారు.

సెబీ స్పష్టత.. హెచ్చరిక

సెబీ తన సర్క్యు­ల­ర్‌­లో ము­ఖ్యం­గా తె­లి­య­జే­సిన వి­ష­యం ఏమి­టం­టే: కొ­న్ని ఆన్‌­లై­న్ వే­ది­క­ల్లో లభిం­చే డి­జి­ట­ల్ గో­ల్డ్/ఈ-గో­ల్డ్ ప్రొ­డ­క్టు­లు సెబీ ని­యం­త్రణ పరి­ధి­లో­కి రావు. అవి సె­క్యూ­రి­టీ­లు­గా­గా­నీ లేదా కమో­డి­టీ డె­రి­వే­టి­వ్‌­లు­గా­గా­నీ నమో­దు కా­లే­దు. సెబీ మదు­ప­రి రక్షణ వ్య­వ­స్థ కింద అవి ఉం­డ­వు కా­బ­ట్టి, ఒక­వేళ ఆ వే­ది­క­లు మూ­త­బ­డి­తే మదు­ప­రు­లు నష్ట­పో­యే ప్ర­మా­దం ఉం­ద­ని, చట్ట­రీ­త్యా తాము ఏమీ చే­య­లే­మ­ని సెబీ స్ప­ష్టం చే­సిం­ది. కా­బ­ట్టి, మదు­ప­రు­లు ఈ రక­మైన పె­ట్టు­బ­డుల వి­ష­యం­లో చాలా జా­గ్ర­త్త­గా ఉం­డా­ల­ని హె­చ్చ­రిం­చిం­ది. సెబీ ఛై­ర్మ­న్ తు­హి­న్ కాంత పాం­డే కూడా డి­జి­ట­ల్ గో­ల్డ్ పథ­కా­లు తమ పరి­ధి­లో­కి రా­వ­ని, వా­టి­ని ని­యం­త్రిం­చా­ల­ని తాము భా­విం­చ­డం లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు.సెబీ హె­చ్చ­రి­కల నే­ప­థ్యం­లో, ఆర్థిక ని­పు­ణు­లు మదు­ప­రు­ల­కు కీలక సూ­చ­న­లు చే­శా­రు.నియంత్రిత ఉత్పత్తులే శ్రేయస్కరం: సెబీ నియంత్రిత ఉత్పత్తులైన గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (EGRs) లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి సురక్షితమని మరియు చట్టపరమైన రక్షణ కూడా ఉంటుందని పేర్కొన్నారు.

తక్షణ ఉప­సం­హ­రణ అవ­స­రం లేదు: ఫి­న్‌­టె­క్ యా­ప్‌­లు లేదా సెబీ ని­యం­త్ర­ణ­లో లేని ఇతర వే­ది­కల ద్వా­రా డి­జి­ట­ల్ గో­ల్డ్‌­లో పె­ట్టు­బ­డి పె­ట్టి­న­వా­రు వెం­ట­నే భయ­ప­డి ఉప­సం­హ­ర­ణల గు­రిం­చి ఆలో­చిం­చా­ల్సిన అవ­స­రం లే­ద­ని ని­పు­ణు­లు తె­లి­పా­రు. ఖచ్చి­త­మైన పరి­శీ­లన ము­ఖ్యం: పె­ట్టు­బ­డి పె­ట్టిన యాప్/సం­స్థల వా­ల్టిం­గ్ (ని­ల్వ), బ్యా­కిం­గ్, రి­డెం­ప్ష­న్ ని­బం­ధ­న­లు, ఫీ­జు­లు మరి­యు లి­క్వి­డి­టీ గు­రిం­చి క్షు­ణ్ణం­గా ఆరా తీ­య­డం ఉత్త­మం. అత్య­ధిక రి­స్క్ ఉన్న పె­ట్టు­బ­డు­లు: డి­జి­ట­ల్ గో­ల్డ్ సెబీ పరి­ధి­లో­కి రా­నం­దున, స్ప­ష్ట­మైన వి­ధి­వి­ధా­నా­లు లే­క­పో­వ­డం­తో మదు­ప­రు­ల­కు నష్టా­లు వా­టి­ల్లే ప్ర­మా­దం అధి­కం­గా ఉం­టుం­ద­ని, కా­బ­ట్టి సు­ర­క్షిత పె­ట్టు­బ­డి సా­ధ­నా­ల్లో పె­ట్ట­డ­మే మం­చి­ద­ని ని­పు­ణుల అభి­ప్రా­యం. యువ మదు­ప­రు­లు డి­జి­ట­ల్ గో­ల్డ్‌­పై ఆస­క్తి చూ­పు­తు­న్న­ప్ప­టి­కీ, ఈ పె­ట్టు­బ­డి సా­ధ­నం­లో రి­స్క్ మరి­యు వి­శ్వ­స­నీ­యత అం­శా­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కో­వా­ల్సిన అవ­స­రా­న్ని సెబీ హె­చ్చ­రి­క­లు గు­ర్తు చే­శా­యి. తమ కష్టా­ర్జి­తా­న్ని సు­ర­క్షి­తం­గా ఉం­చు­కో­వా­లం­టే, మదు­ప­రు­లు వి­శ్వ­స­నీ­య­మైన, పా­ర­ద­ర్శ­క­మైన, సెబీ రె­గ్యు­లే­టె­డ్‌ వే­ది­క­ల్లో­నే పె­ట్టు­బ­డు­లు పె­ట్టా­ల­ని ని­పు­ణు­లు బలం­గా సి­ఫా­ర్సు చే­స్తు­న్నా­రు.

Tags:    

Similar News