ఓటీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త ప్లాన్స్
Disney Plus Hotstar: ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.;
Diseny Hotstar
Disney Plus Hotstar: ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీఐపీ ప్లాన్‌ను పూర్తిగా తొలగించదని తెలుస్తోంది. గతంలో వీఐపీ వినియోగదారులకు ప్రీమియం కంటెంట్ అందుబాటులో ఉండేది కాదు. ఈ కొత్త ప్లాన్లు రూ. 499 నుంచి ప్రారంభం కానున్నాయి. డిస్నీ ప్రీమియం ధర రూ.1499 ఉండేది. ఇక ఇప్పుడు ప్రీమియంలో కంటెంట్‌ను కూడా రూ.499 ప్లాన్‌తో చూసే అవకాశం కల్పించింది. రూ.499 ప్లాన్ ద్వారా డివైస్‌ల సంఖ్య తగ్గించింది. వీడియో క్వాలిటీ పైనే నిబంధనలు విధించారు. ఈ కొత్త ప్లాన్లు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఇక రూ.899 సూపర్ ప్లాన్‌ను కూడా హాట్‌స్టార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఒకేసారి రెండు ఫోన్లలో వీక్షించే అవకాశం ఉంటుంది. రూ.1499 పాత ప్రీమియం ప్లాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో డివైస్ల సంఖ్య పెంచింది. ఈ ప్లాన్ ద్వారా 4 డివైస్‌ల్లో ఒకేసారి కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. హెచ్‌డీ క్వాలిటీ.. అలాగే 4కే రిజల్యూషన్‌తో ఈ కంటెంట్‌ను చూడవచ్చు. ప్లాన్ల విషయానికి వస్తే.. రూ.499 డిస్నీప్లస్ హాట్ స్టార్ ప్లాన్ వ్యవధి ఏకంగా ఏడాది. ఈ ప్లాన్‌తో కేవలం మొబైల్‌లో మాత్రమే కంటెంట్‌ను వీక్షించగలం.