Kia Seltos : టాప్ వేరియంట్లకే క్యూ కడుతున్న జనం..6 లక్షల మైలురాయిని దాటిన కియా సెల్టోస్.

Update: 2026-02-19 14:45 GMT

Kia Seltos : కియా ఇండియా మోస్ట్ పాపులర్ మోడల్ సెల్టోస్ సరికొత్త రికార్డును సృష్టించింది. 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, తాజాగా 6 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించినట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం ఐదేళ్లలోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం సెల్టోస్ క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పింది. సాధారణంగా బడ్జెట్ వేరియంట్లు ఎక్కువగా అమ్ముడవుతాయని మనం అనుకుంటాం. కానీ సెల్టోస్ విషయంలో కథ వేరుగా ఉంది. మొత్తం విక్రయాల్లో 29 శాతం వాటా కేవలం టాప్ వేరియంట్లదే ఉండటం విశేషం. అంటే, భారతీయ కస్టమర్లు ఇప్పుడు కారు ధర కంటే అందులోని సేఫ్టీ, టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దీనిబట్టి అర్థమవుతోంది.

కియా ఇండియా తన తర్వాతి విడత వృద్ధి కోసం జనవరి 2026లో సెకండ్ జనరేషన్ సెల్టోస్‎ను లాంచ్ చేసింది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ మోడల్ మునుపటి కంటే పొడవుగా, వెడల్పుగా ఉంది. కొలతల విషయానికి వస్తే పొడవు 4,460 మిమీ, వెడల్పు 1,830 మిమీ, వీల్‌బేస్ 2,690 మిమీగా ఉంటుంది. ఇందులో 30-అంగుళాల భారీ ట్రినిటీ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఎన్నో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

కొత్త సెల్టోస్‌లో Level 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను అందించారు. ఇది రోడ్డుపై ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి 24 రకాల సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ సెల్టోస్ లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్, iMT, DCT గేర్‌బాక్స్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News