Nissan Gravite : నిస్సాన్ గ్రావిటే వచ్చేసింది..ఏ మోడల్ ధర ఎంత? ఏ ఫీచర్లు ఉన్నాయి?

Update: 2026-02-19 15:30 GMT

Nissan Gravite : నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్లో తన సరికొత్త 7-సీటర్ కారు గ్రావిటేని లాంచ్ చేసింది. మాగ్నైట్ తర్వాత నిస్సాన్ నుంచి వస్తున్న ఈ ఎంపీవీ, మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంగా మారనుంది. కేవలం రూ.5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారు, తన బేస్ వేరియంట్ నుంచే అదిరిపోయే ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ఈ కారుకు సంబంధించిన వివిధ మోడళ్లు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

1. బేస్ మోడల్.. విసియా

ఇది గ్రావిటే శ్రేణిలో ప్రారంభ మోడల్. తక్కువ ధరలో ఉన్నప్పటికీ, ఇందులో భద్రతకు పెద్దపీట వేశారు. ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్-బ్లాక్ సీట్ కవర్లు ఇచ్చారు. రెండో వరుస సీట్లను ఫోల్డ్, స్లైడ్, రిక్లైన్ చేసుకోవచ్చు. అవసరమైతే మూడో వరుస సీట్లను పూర్తిగా తీసివేసి బూట్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2. సెకండ్ బేస్ మోడల్.. ఎసెంటా

విసియా మోడల్ కన్నా మరిన్ని వినోద, సౌకర్యవంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్ బటన్లు, రెండు, మూడు వరుసల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి.

3. సెకండ్ టాప్ మోడల్.. ఎన్-కనెక్టా

ఈ వేరియంట్ నుంచి కస్టమర్లకు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి. ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, 50 కిలోల బరువు మోయగల రూఫ్ రైల్స్, రియర్ వైపర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, సెంటర్ కన్సోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయి.

4. టాప్ మోడల్.. టెక్నా

ఇది గ్రావిటే లో అత్యంత విలాసవంతమైన వేరియంట్. 7-అంగుళాల పూర్తిస్థాయి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, 15-అంగుళాల డ్యూయల్ టోన్ వీల్స్, పుష్-బటన్ స్టార్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో ఇది వస్తుంది.

5. స్పెషల్ ఎడిషన్.. లాంచ్ ఎడిషన్

మొదటి 1001 మంది కస్టమర్ల కోసం మాత్రమే నిస్సాన్ ఈ పరిమిత ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇందులో టెక్నా మోడల్ కన్నా అదనంగా JBL సౌండ్ సిస్టమ్, డ్యూయల్ డ్యాష్‌క్యామ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News