విమాన ప్రయాణికులకు షాక్!
మినిమం ఎయిర్ ఫేర్స్ 10శాతం పెంచుకునేలా నిర్ణయం వెలువరించింది.;
విమాన ప్రయాణ టికెట్ల ధరలు 5శాతం పెంచాలని నిర్ణయించింది సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్. టర్బో జెట్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో సహజంగానే కంపెనీలపై భారం పడుతోంది. దీంతో మినిమం ఎయిర్ ఫేర్స్ 10శాతం పెంచుకునేలా నిర్ణయం వెలువరించింది. అదే సమయంలో ప్రజంట్ ఉన్న 80శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం కంటిన్యూ చేసింది.
కొన్ని చోట్ల విమాన ప్రయాణీకులకు RTPCR టెస్ట్ తప్పనిసరి చేశారు. అదే సమయంలో ఆంక్షల కారణంగా ప్రయాణీకులు తగ్గారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రంగాన్ని మరింత సంక్షోభంలోపడకుండా అప్రమత్తమవుతోంది. అటు ఆయిల్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పదని కేంద్రం ప్రకటించింది.