Mahindra XUV 7XO vs Tata Safari : పవర్‌లో మహీంద్రా..లగ్జరీలో టాటా..మీ ఫ్యామిలీకి ఏ ఎస్‌యూవీ బెస్ట్?
Mahindra XUV 7XO vs Tata Safari : భారతదేశంలో 7-సీటర్ ఎస్‌యూవీలంటే మనందరికీ గుర్తొచ్చే పేర్లు టాటా సఫారీ, మహీంద్రా XUV 700. అయితే ఇప్పుడు మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను కొత్త హంగులతో, సరికొత్త పేరుతో మహీంద్రా XUV 7XOగా మార్కెట్లోకి వదిలింది. అత్యాధునిక ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ కొత్త కారు, టాటా సఫారీకి గట్టి పోటీనిస్తోంది.
ధర, వేరియంట్లు: కొత్తగా లాంచ్ అయిన మహీంద్రా XUV 7XO ధరలు రూ.13.66 లక్షల నుండి ప్రారంభమై రూ.24.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది మొత్తం ఆరు రకాల ట్రిమ్ ఆప్షన్లలో, 6, 7 సీటర్ లేఅవుట్లలో అందుబాటులో ఉంది. టాటా సఫారీ కూడా దాదాపు ఇదే ధర శ్రేణిలో ఉంటూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే మహీంద్రా తన కొత్త వేరియంట్లతో కస్టమర్లకు ఎక్కువ ఛాయిస్‌ను అందిస్తోంది.
ఇంజిన్ పవర్‌లో ఎవరేంటి?: పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే మహీంద్రా XUV 7XO స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇందులో పెట్రోల్,డీజిల్.. రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇటీవలే లాంచ్ అయిన టాటా సఫారీ పెట్రోల్ వెర్షన్ కంటే మహీంద్రా 7XO పెట్రోల్ ఇంజిన్ ఎక్కువ హార్స్ పవర్, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో కూడా సఫారీ కంటే మహీంద్రా ఇంజినే పవర్‌ఫుల్.
డ్రైవ్‌ట్రెయిన్: టాటా సఫారీ కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD)తో మాత్రమే వస్తుంది. కానీ మహీంద్రా XUV 7XOలో మీకు FWDతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా లభిస్తుంది. అంటే ఆఫ్-రోడింగ్‌కు మహీంద్రానే బెస్ట్.
సైజులో తేడాలు ఇవే
చూడటానికి రెండు కార్లు భారీగా ఉన్నప్పటికీ, కొలతల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. మహీంద్రా XUV 7XO, సఫారీ కంటే 27 మిమీ ఎక్కువ పొడవు ఉంటుంది. టాటా సఫారీ, మహీంద్రా కారు కంటే 32 మిమీ ఎక్కువ వెడల్పుగా ఉండి, లోపల షోల్డర్ రూమ్ ఎక్కువగా ఇస్తుంది. ఎత్తులో కూడా టాటా సఫారీనే టాప్. ఇది మహీంద్రా కంటే 40 మిమీ ఎత్తుగా ఉండి మంచి రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది. వీల్‌బేస్ విషయంలో మహీంద్రా 9 మిమీ ఎక్కువగా ఉండటం వల్ల లెగ్ రూమ్ కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.