Adventure Bikes : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా.. పర్ఫెక్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే.. ఓ లుక్కేయండి.
Adventure Bikes : ఇటీవల కాలంలో భారత మార్కెట్లో అడ్వెంచర్ మోటార్‌సైకిల్స్ సెగ్మెంట్‌కు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఈ బైకులు కేవలం సిటీలో తిరగడానికే కాదు, లాంగ్ జర్నీలు, కష్టమైన రోడ్లు, ఎక్కువ సామాన్లను తీసుకెళ్లడానికి చాలా అనువుగా ఉంటాయి. అద్భుతమైన పవర్, కంఫర్ట్, ఆఫ్-రోడ్ సామర్థ్యం కలగలిపి ఉంటాయి కాబట్టే బైక్ లవర్స్ వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ పండుగ సీజన్‌లో బైక్ కొనాలనుకునే వారి కోసం, మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ అడ్వెంచర్ బైకుల వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.
1. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450
ప్రస్తుతం అడ్వెంచర్ బైకుల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఇది. దీని ధర రూ. 3.06 లక్షల నుంచి రూ. 3.20 లక్షల వరకు ఉంటుంది. 452 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 39.47 బీహెచ్‌పీ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ముందు భాగంలో 21-అంగుళాల, వెనుక భాగంలో 17-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్ ఉంటాయి. ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఆప్షన్ కూడా ఉంది.
2. హీరో ఎక్స్‌పల్స్ 210
దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన అడ్వెంచర్ బైక్స్‌లో ఇది ఒకటి. బడ్జెట్‌లో ఆఫ్-రోడింగ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ. 1.62 లక్షల నుంచి రూ. 1.71 లక్షల మధ్య ఉంటుంది. 210 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 24.2 బీహెచ్‌పీ పవర్, 20.7 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ముందు 21 అంగుళాల, వెనుక 18 అంగుళాల వైర్ స్పోక్ వీల్స్ ఉంటాయి. ఈ బైక్ బరువు కేవలం 168 కిలోలు ఉండటం వల్ల ఆఫ్-రోడింగ్‌కు చాలా తేలికగా ఉంటుంది.
3. కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్
లాంగ్ రైడ్‌లకు, పవర్ కోసం చూసే వారికి కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ చాలా మంచి బైక్. దీని ధర రూ. 3.04 లక్షలు. 398.63 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్. ఇది 45.3 బీహెచ్‌పీ పవర్, 39 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 390 అడ్వెంచర్ సిరీస్‌లో రోడ్-ఓరియెంటెడ్ వెర్షన్. ఇందులో 19/17-అంగుళాల అల్లాయ్ వీల్ సెటప్ ఉంటుంది.
4. టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్
టీవీఎస్ కంపెనీ అడ్వెంచర్ సెగ్మెంట్‌లో ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన బైక్ అపాచీ ఆర్టీఎక్స్. దీని ధర రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.29 లక్షల మధ్య ఉంటుంది. కొత్త RTXD4 299 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 36 PS పవర్, 28.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది రైడ్-బై-వైర్ టెక్నాలజీతో వస్తుంది. రైడ్ మోడ్స్ (ర్యాలీ, అర్బన్, టూర్, రెయిన్) ఉన్నాయి. ఇందులో కూడా 19/17-అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు.
5. కవాసకి కేఎల్‌ఎక్స్ 230
ఆఫ్-రోడింగ్ ఇష్టపడేవారికి తక్కువ ధరలో మంచి ఆప్షన్ కవాసకి KLX 230. ఇటీవల జీఎస్టీ రేట్లు తగ్గించడం వలన దీని ధర తగ్గింది. దీని ధర రూ. 1.84 లక్షలు. దీనిలో 233 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.37 బీహెచ్‌పీ పవర్, 19 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ముందు 21-అంగుళాల, వెనుక 18-అంగుళాల వైర్-స్పోక్ వీల్స్, అలాగే 240ఎమ్ఎమ్/250ఎమ్ఎమ్ సస్పెన్షన్ ట్రావెల్ దీనిని ఆఫ్-రోడింగ్‌కు అనుకూలంగా మారుస్తుంది.