Financial Rules : నవంబర్ 1 నుంచి మారుతున్న బ్యాంక్ రూల్స్..ఈ సారి ఇంకా స్ట్రిక్ట్.

Update: 2025-10-29 11:32 GMT

Financial Rules : వచ్చే నెల అంటే నవంబర్ 2025 నెల నుంచి అనేక ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా బ్యాంకు కస్టమర్లు, క్రెడిట్ కార్డు యూజర్లు, పెన్షనర్లపై ప్రభావం చూపుతాయి. ఒకే ఖాతాకు నలుగురిని నామినేట్ చేసే కొత్త బ్యాంకింగ్ సౌలభ్యం, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఫీజుల్లో మార్పులు, పెన్షన్‌కు సంబంధించిన గడువులు పొడిగింపు వంటి వివరాలను తెలుసుకుందాం. ఆర్థిక లావాదేవీల విషయంలో గందరగోళం లేకుండా ఉండాలంటే ఈ కొత్త నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి.

నవంబర్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ లా (సవరణ) చట్టం, 2025లోని కొన్ని నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై బ్యాంకు ఖాతాదారులు, సేఫ్టీ లాకర్లు, సేఫ్ కస్టడీలో ఉంచిన వస్తువుల కోసం నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. కస్టమర్లు తమకు నచ్చిన విధంగా నలుగురిని ఒకేసారి నామినేట్ చేయవచ్చు. లేదా, అవసరాన్ని బట్టి ఏ క్రమంలో ఆ నామినీకి డబ్బు లేదా వస్తువులు అందాలి అనే విషయాన్ని కూడా ముందే నిర్ణయించవచ్చు. దీని వల్ల ఖాతాదారు మరణించిన తర్వాత క్లెయిమ్ విషయంలో వచ్చే వివాదాలు, ఆలస్యం తగ్గుతాయి.

ఎస్‌బీఐ కార్డ్ తన ఫీజుల నిర్మాణంలో మార్పులు ప్రకటించింది. ఇవి నవంబర్ 1, 2025 నుంచి అమలవుతాయి. ఎడ్యూకేషన్ పేమెంట్లకు థర్డ్-పార్టీ యాప్‌లైన CRED, Cheq, MobiKwik ద్వారా చేస్తే, ఆ మొత్తంపై 1% ఎక్స్ ట్రా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. నేరుగా స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లేదా వారి పీఓఎస్ మెషీన్‌పై చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.1,000 కంటే ఎక్కువ విలువైన వాలెట్ లోడ్ ట్రాన్సాక్షన్లపై కూడా 1% ఛార్జ్ వసూలు చేయబడుతుంది.

నవంబర్ నెలలో పెన్షనర్లకు సంబంధించిన రెండు ముఖ్యమైన గడువులు ఉన్నాయి.

పీఎన్‌బీ లాకర్ ఛార్జీలు తగ్గింపు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ రెంట్ ఛార్జీలను తగ్గించింది. అక్టోబర్ 16, 2025న ఇచ్చిన నోటీస్ ప్రకారం.. ఈ కొత్త ధరలు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన 30 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ తగ్గింపు అన్ని రకాల లాకర్ల సైజు, ప్రాంతాలను బట్టి మారుతాయి.

జీవన్ ప్రమాణ్ పత్రం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెన్షనర్లు అందరూ నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2025 లోపు తమ వార్షిక జీవన ప్రమాణ పత్రం సమర్పించాలి. దీనివల్ల పెన్షన్ ఆగిపోకుండా కొనసాగుతుంది. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచే సమర్పించడానికి అవకాశం ఇచ్చారు.

యూపీఎస్ స్కీమ్‌లో చేరడానికి గడువు పెంపు

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో ముఖ్యమైన అవకాశం ఇచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి పాత విధానంలో ఉన్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోకి మారడానికి ఉన్న చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30, 2025 వరకు పొడిగించింది. ఈ అవకాశం ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వాములకు కూడా వర్తిస్తుంది.

Tags:    

Similar News