ECONOMIC: భారత ఆర్థిక ఇంజిన్‌కు మరో బూస్ట్‌

బడ్జెట్ 2026పై భారీ అంచనాలు...రూ.2.65 లక్షల కోట్ల కేటాయింపులు...కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్ పనులకు ప్రాధాన్యం...AI ఆధారిత సేఫ్టీ & మెయింటెనెన్స్ సిస్టమ్స్

Update: 2026-01-17 07:00 GMT

భారత ఆర్థిక వ్య­వ­స్థ­ను ముం­దు­కు నడి­పిం­చే కీలక రం­గా­ల్లో రై­ల్వే ఒకటి. ప్ర­యా­ణి­కుల రవా­ణా­తో పాటు సరు­కు రవా­ణా­లో­నూ కీలక పా­త్ర పో­షి­స్తు­న్న ఈ రం­గం­పై ప్ర­తి బడ్జె­ట్‌­కు ముం­దే భారీ అం­చ­నా­లు నె­ల­కొం­టా­యి. రా­బో­యే బడ్జె­ట్‌ 2026లో రై­ల్వే రం­గా­ని­కి సం­బం­ధిం­చి కేం­ద్ర ప్ర­భు­త్వం గణ­నీ­య­మైన ని­ర్ణ­యా­లు తీ­సు­కు­నే అవ­కా­శ­ముం­ద­ని మా­ర్కె­ట్ వర్గా­లు వి­శ్లే­షి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా మౌ­లిక సదు­పా­యాల అభి­వృ­ద్ధి, ఆధు­నీ­క­ర­ణే ఈసా­రి ప్ర­ధాన అజెం­డా­గా కని­పి­స్తోం­ది.

రూ.2.65 లక్షల కోట్ల కేటాయింపులు

తాజా అం­చ­నాల ప్ర­కా­రం, ఈసా­రి రై­ల్వే బడ్జె­ట్ గత ఏడా­ది­తో పో­లి­స్తే సు­మా­రు 5 శాతం వరకు పె­రి­గే అవ­కా­శం ఉంది. జూ­పి­ట­ర్ వ్యా­గ­న్స్ లి­మి­టె­డ్ ఎండీ వి­వే­క్ లో­హి­యా అభి­ప్రా­యం ప్ర­కా­రం, మొ­త్తం కే­టా­యిం­పు­లు రూ.2.65 లక్షల కో­ట్ల­కు చే­ర­వ­చ్చ­ని అం­చ­నా. ఈ కే­టా­యిం­పు­లు కొ­త్త ప్రా­జె­క్టు­ల­కే పరి­మి­తం కా­కుం­డా, ఉన్న నె­ట్‌­వ­ర్క్‌­ను పూ­ర్తి­స్థా­యి­లో ఆధు­నీ­క­రిం­చేం­దు­కు ఉప­యో­గిం­చ­ను­న్నా­రు.

రద్దీకి చెక్‌ 

సాం­కే­తి­కత లే­కుం­డా రై­ల్వే అభి­వృ­ద్ధి సా­ధ్యం కా­ద­న్న ది­శ­గా కేం­ద్రం ముం­ద­డు­గు వే­స్తోం­ది. ఈసా­రి ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ (AI) ఆధా­రిత సి­స్ట­మ్స్‌­ను వి­స్తృ­తం­గా వి­ని­యో­గిం­చ­ను­న్నా­రు. ప్ర­మా­దాల ని­వా­రణ, ప్రె­డి­క్టి­వ్ మె­యిం­టె­నె­న్స్, ట్రా­ఫి­క్ మే­నే­జ్‌­మెం­ట్‌­లో ఏఐ కీలక పా­త్ర పో­షిం­చ­నుం­ది. దీని ద్వా­రా ప్ర­యా­ణి­కు­ల­కు మరింత సు­ర­క్షి­త­మైన, వే­గ­వం­త­మైన ప్ర­యా­ణం అం­దిం­చా­ల­న్న­ది లక్ష్యం.

రైల్వేలో ఏఐ విప్లవం

సాం­కే­తి­కత లే­కుం­డా రై­ల్వే అభి­వృ­ద్ధి సా­ధ్యం కా­ద­న్న ది­శ­గా కేం­ద్రం ముం­ద­డు­గు వే­స్తోం­ది. ఈసా­రి ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ (AI) ఆధా­రిత సి­స్ట­మ్స్‌­ను వి­స్తృ­తం­గా వి­ని­యో­గిం­చ­ను­న్నా­రు. ప్ర­మా­దాల ని­వా­రణ, ప్రె­డి­క్టి­వ్ మె­యిం­టె­నె­న్స్, ట్రా­ఫి­క్ మే­నే­జ్‌­మెం­ట్‌­లో ఏఐ కీలక పా­త్ర పో­షిం­చ­నుం­ది. దీని ద్వా­రా ప్ర­యా­ణి­కు­ల­కు మరింత సు­ర­క్షి­త­మైన, వే­గ­వం­త­మైన ప్ర­యా­ణం అం­దిం­చా­ల­న్న­ది లక్ష్యం.

ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం

ప్ర­భు­త్వ ని­ధు­ల­తో పాటు ప్రై­వే­ట్ పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డం­పై­నా బడ్జె­ట్‌ ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్ట­నుం­ది. ని­బం­ధ­నల సర­ళీ­క­రణ, పబ్లి­క్–ప్రై­వే­ట్ పా­ర్ట్‌­న­ర్‌­షి­ప్ మో­డ­ల్ ద్వా­రా మరి­న్ని కం­పె­నీ­ల­ను రై­ల్వే ప్రా­జె­క్టు­ల్లో భా­గ­స్వా­ము­లు­గా చే­సేం­దు­కు కేం­ద్రం సి­ద్ధ­మ­వు­తోం­ది.

గేమ్ ఛేంజర్ ప్లాన్

ప్ర­స్తు­తం మొ­త్తం సరు­కు రవా­ణా­లో రై­ల్వే వాటా 29 శా­తం­గా ఉంది. నే­ష­న­ల్ రైల్ ప్లా­న్ ప్ర­కా­రం 2030 నా­టి­కి 3,000 మి­లి­య­న్ టన్ను­లు, 2045 నా­టి­కి 45 శాతం వాటా సా­ధిం­చ­డ­మే లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు. ఈ లక్ష్యా­ల­ను చే­రు­కో­వా­లం­టే ఈసా­రి బడ్జె­ట్‌­లో తీ­సు­కు­నే ని­ర్ణ­యా­లు కీ­ల­కం­గా మా­ర­ను­న్నా­యి. మొ­త్తా­ని­కి, బడ్జె­ట్‌ 2026లో రై­ల్వే రంగం సం­ఖ్య­ల­కే పరి­మి­తం కా­కుం­డా, భారత ఆర్థిక వ్య­వ­స్థ­కు మరింత వేగం ఇచ్చే­లా, ప్ర­యా­ణి­కుల భద్రత, సా­మ­ర్థ్యం, లా­జి­స్టి­క్స్ రం­గం­లో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­ల­కు వే­ది­క­గా మా­ర­నుం­ద­ని బి­జి­నె­స్ వర్గా­లు భా­వి­స్తు­న్నా­యి.

Tags:    

Similar News