Upcoming Cars 2026 : రోడ్లపైకి రెనాల్ట్-నిస్సాన్ గర్జన.. 2028 కల్లా 5 సరికొత్త ఎస్‌యూవీలు సిద్ధం.
Upcoming Cars 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్లో తమ పట్టును బిగించేందుకు ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రెనాల్ట్, జపాన్ దిగ్గజం నిస్సాన్ చేతులు కలిపాయి. ఈ రెండు కంపెనీల వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా 2028 నాటికి భారత రోడ్లపైకి ఏకంగా ఐదు సరికొత్త ఎస్‌యూవీలను తీసుకురావాలని నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా కొత్త మోడళ్లు లేక వెనుకబడిన ఈ కంపెనీలు, ఇప్పుడు అత్యాధునిక ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. ఆ ఐదు అదిరిపోయే మోడళ్ల వివరాలు ఇక్కడ చూడండి.
1. నిస్సాన్ టెక్టాన్
నిస్సాన్ నుంచి రాబోతున్న అత్యంత స్టైలిష్ ఎస్‌యూవీ టెక్టాన్. ఇది చూడటానికి చాలా షార్ప్‌గా, బోల్డ్ లుక్‌తో ఉండబోతోంది. మార్చి చివరలో దీనిని ప్రపంచానికి పరిచయం చేసి, ఏప్రిల్ నెలాఖరుకల్లా మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. రెనో డస్టర్ తరహాలోనే, ఈ కారు లాంచ్ అయిన ఏడాది లోపే దీని హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా నిస్సాన్ తీసుకురాబోతోంది. ఇది నిస్సాన్ బ్రాండ్ ఇమేజ్‌ను ఇండియాలో మరో స్థాయికి తీసుకెళ్తుందని కంపెనీ భావిస్తోంది.
2. న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్
భారత్‌లో ఎస్‌యూవీ ట్రెండ్‌ను సెట్ చేసిన డస్టర్, ఇప్పుడు థర్డ్-జనరేషన్ మోడల్‌తో సరికొత్తగా రాబోతోంది. ప్రత్యేకంగా భారతీయ రోడ్లు, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా దీనిని రూపొందించారు. మార్చి 21న పెట్రోల్ ఇంజిన్‌తో ఇది లాంచ్ కానుంది. ఈ కొత్త వెర్షన్‌లో కనెక్టివిటీ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. పెట్రోల్ మోడల్ వచ్చిన కొద్ది నెలలకే, అంటే ఏడాది చివరలో హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా రెనాల్ట్ విడుదల చేయనుంది.
3. రెనాల్ట్ 3-రో ఎస్‌యూవీ
కుటుంబ సమేతంగా ప్రయాణించే వారి కోసం రెనాల్ట్ 2026 చివరలో ఒక భారీ 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ఇందులో కేవలం సీట్లు మాత్రమే కాకుండా, సెకండ్ రోలో వెంట్లేటెడ్ సీట్లు, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇంజిన్ పరంగా 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.8 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు దీని సొంతం. దీని డిజైన్ చాలా గంభీరంగా ఉండబోతోందని సమాచారం.
4. నిస్సాన్ 3-రో ఎస్‌యూవీ
2026 మొదటి త్రైమాసికంలో నిస్సాన్ కూడా తన సొంత 3-రో ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది రెనో మోడల్‌కు సమానంగా ఉన్నప్పటికీ, దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ పూర్తిగా భిన్నంగా, నిస్సాన్ సిగ్నేచర్ స్టైల్‌లో ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, పావర్డ్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఇది పెట్రోల్, హైబ్రిడ్ వెర్షన్లలో అందుబాటులోకి రానుంది.
5. రెనాల్ట్ బ్రిజర్
సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెనాల్ట్ నుంచి రాబోతున్న బ్రహ్మాస్త్రం ఈ బ్రిజర్. ఇది నేరుగా టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, మహీంద్రా విజన్ ఎస్ కాన్సెప్ట్ వెర్షన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆఫ్-రోడింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్ కానుంది.