Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు.. స్వల్ప తగ్గుదల..

Gold and Silver Rates Today: నిన్నటితో (10-08-2022 బుధవారం) పోలిస్తే బంగారం ధరల్లో ఈరోజు రూ.600 తగ్గింది.

Update: 2022-08-11 00:55 GMT

Gold and Silver Rates Today: నిన్నటితో (10-08-2022 బుధవారం) పోలిస్తే బంగారం ధరల్లో ఈరోజు రూ.600 తగ్గింది. ఈరోజు (11-08-2022 గురువారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,350 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,380గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.300 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,200 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,200గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 58,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(11-08-2022 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News