పసిడి ధరలకు రెక్కలు.. 10 గ్రాముల బంగారం ధర..

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల నేపథ్యంలోనే దేశీ మార్కెట్‌లో గోల్డ్ రేట్ పెరగడానికి కారణమని

Update: 2020-11-23 06:06 GMT

గత ఐదు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధరలకు ఈ రోజు రెక్కలు వచ్చాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల నేపథ్యంలోనే దేశీ మార్కెట్‌లో గోల్డ్ రేట్ పెరగడానికి కారణమని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150లు పైకి కదిలి రూ.51,390కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.210లు పెరిగి రూ.47,110కు చేరుకుంది.

వెండి కూడా పసిడి దారిలో పయనిస్తూ రూ.200 ల పెరుగుదలతో రూ.66,700కు చేరింది. నాణెపు తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు వ్యాపారస్తులు. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే ఔన్స్ బంగారం ధర 0.03 శాతం పెరుగుదలతో 1873 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 24.39 డాలర్లకు ఎగసింది. బంగారం ధరల పెరుగుదలపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.

Tags:    

Similar News