Gold Rates : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

మొన్నటిదాకా చుక్కలనంటిన బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. గతంలో 56 వేల మార్కును తాకిన 10 గ్రాముల పసిడి ధర... ప్రస్తుతం 48 వేలకు పడిపోయింది.

Update: 2021-02-06 15:00 GMT

మొన్నటిదాకా చుక్కలనంటిన బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. గతంలో 56 వేల మార్కును తాకిన 10 గ్రాముల పసిడి ధర... ప్రస్తుతం 48 వేలకు పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 48 వేలు, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 44 వేలకు తగ్గింది. కేవలం ఐదు రోజుల్లోనే తులం బంగారం ధర 2 వేలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొన్నటిదాకా కస్టమర్లు లేక వెలవెలబోయిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా దిగివచ్చాయి. కేజీ వెండి ధర 73 వేల 400 రూపాయలకు తగ్గింది. 

Tags:    

Similar News