హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.80,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరగడంతో తొలిసారి రూ.87,930లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.
2025, జనవరి 1న 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.71,500. నిన్న ఆల్ టైం రికార్డ్ ధర రూ.80,600కు చేరింది. అంటే 40రోజుల్లో రూ.9వేలకు పైగా పెరిగింది. ట్రంప్ రాకతో US డాలర్ బలపడగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండటంతో పసిడి ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.