Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు.. నిన్నటి కంటే ఈ రోజు మరింత తక్కువ..

Gold, Silver Price Today: అమెరికా పార్లమెంటు భారీ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని భావిస్తున్నారు. ప్యాకేజీ ప్రభావం పసిడితో పాటు ఈక్విటీ మార్కెట్లపైన కూడా ఉంటుంది. పసిడి ధరలతో పాటు వెండి ధర కూడా నేడు రూ.1000 తగ్గింది.

Update: 2021-03-02 06:45 GMT

Gold, Silver Price Today: 

Gold, Silver Price Today: బంగారం, వెండి ఫ్యూచర్ ధరలు నేడు (మార్చి 2, మంగళవారం) మరింత తగ్గాయి. నిన్న రూ.500 వరకు తగ్గిన బంగారం ధర నేడు మరింత క్షీణించి రూ.45,000 స్థాయికి పడిపోయింది. అమెరికా పార్లమెంటు భారీ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని భావిస్తున్నారు. ప్యాకేజీ ప్రభావం పసిడితో పాటు ఈక్విటీ మార్కెట్లపైన కూడా ఉంటుంది. పసిడి ధరలతో పాటు వెండి ధర కూడా నేడు రూ.1000 తగ్గింది.

రూ.45,000 స్థాయికి బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX) లో బంగారం ధర నేడు ప్రారంభ సెషన్లో రూ.45,000 స్థాయికి తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.223.00 (0.49%) తగ్గి రూ.45,085.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,066 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,135.00 వద్ద గరిష్టాన్ని రూ.44.984.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.11,200 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.234.00 (0.51%) తగ్గి రూ.45.232 వద్ద ట్రేడ్ అయింది. రూ. 45,205.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,263.00 వద్ద గరిష్టాన్ని రూ.45,149.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర విషయానికి వస్తే నిన్న దాదాపు రూ.1000కి పైగా తగ్గిన ధర నేడు రూ.1000 వరకు తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.962.00 (1.43%) తగ్గి రూ.66,460 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,463.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,473.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,251.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,021.00 (1.48%) తగ్గి రూ.67779.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,0001.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,001.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,512.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 1750 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 11.40 డాలర్లు తగ్గి 1711.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి ధర 8.37 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. ఔన్స్ ధర 0.503 డాలర్లు పెరిగి 26.175 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.020-26.745 డాలర్ల మధ్య కదలాడింది. 

Tags:    

Similar News