PPF: పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

నామినీ వివరాల అప్‌డేట్‌కు నో ఛార్జెస్... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత;

Update: 2025-04-27 05:30 GMT

బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం పీపీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నామినీ వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు ఏ రుసుము కూడా చెల్లించనక్కరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవల ఆమె సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రభుత్వం 2025 ఏప్రిల్ 2న ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్ (2018) ను సవరించింది. ఈ సవరణలతో, పీపీఎఫ్ ఖాతాలో నామినీ అప్‌డేట్ చేసుకునేందుకు వసూలు చేసే రూ.50 ఫీజును తొలగించారు. దీంతో ఖాతాదారులు ఇకపై ఉచితంగా తమ నామినీ వివరాలను సవరించుకోవచ్చు. తాజా సవరణల ప్రకారం, డిపాజిట్లు, సురక్షిత వస్తువులు, లాకర్లకు నాలుగు వరకు నామినీలను జోడించుకునే అవకాశం కల్పించారు. నిపుణుల సూచన మేరకు, పీపీఎఫ్ ఖాతాదారులు నామినీ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేసుకోవాలి. ఖాతాదారు అకాల మరణం చెందినప్పుడు, నామినీ ద్వారా ఖాతాలో ఉన్న మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుంది. లేదంటే క్లెయిమ్ ప్రక్రియ కష్టం అవుతుంది, ఎక్కువ సమయం పట్టే ప్రమాదం ఉంటుంది.

పీపీఎఫ్ ఖాతా ఎలా తెరవాలి?

పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఎవరైనా పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. మైనర్ల పేరుతో కూడా ఖాతా ప్రారంభించవచ్చు. పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ల కాలానికి మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ అనంతరం మొత్తం నగదు ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే, మెచ్యూరిటీ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఖాతాను పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడికి పీపీఎఫ్ ఉత్తమ ఎంపిక అని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈపీఎఫ్ వెబ్‌సైట్లో సరికొత్త ఫామ్- 13ని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది. అందులో ముఖ్యమైనది పీఎఫ్ కాలిక్యులేషన్స్‌లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలు స్పష్టంగా పేర్కొననున్నారు.

Tags:    

Similar News