End of Year Sale : గూగుల్ ధమాకా..పిక్సెల్ 10 సిరీస్‌పై భారీ ఆఫర్లు..రూ.10,000 క్యాష్‌బ్యాక్, వాచ్, బడ్స్‌పై కూడా డిస్కౌంట్.
End of Year Sale : గూగుల్ భారతదేశంలో తమ ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్‌లో పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ప్రకటించారు. ఈ సేల్ జనవరి 2026 ప్రారంభం వరకు అంటే జనవరి 2, 2026 రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా పిక్సెల్ 10 కొనుగోలు చేస్తే రూ.7,000 ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదే పిక్సెల్ 10 ప్రో, ప్రో ఎక్స్‌ఎల్, ప్రో ఫోల్డ్ మోడళ్లపై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు 24 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
కొత్త పిక్సెల్ 10 సిరీస్‌తో పాటు, ఈ సేల్‌లో పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల ధరలు కూడా బాగా తగ్గాయి. పిక్సెల్ 9 ధర రూ.79,999 నుంచి రూ.58,399కి తగ్గింది. అలాగే పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర రూ.1,62,999కి, పిక్సెల్ 9ఏ ధర రూ.44,999కి తగ్గింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం పిక్సెల్ అనుభవాన్ని కోరుకునే వారికి ఈ ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు గూగుల్ తమ యాక్సెసరీలపై కూడా తగ్గింపులు ప్రకటించింది. పిక్సెల్ వాచ్ 3 ధర రూ.5,000 తగ్గి రూ.22,915కి, పిక్సెల్ బడ్స్ ప్రో 2 ధర రూ.22,900 నుంచి తగ్గి రూ.19,900కి అందుబాటులో ఉన్నాయి.
పిక్సెల్ 10 సిరీస్‌ను భారతదేశంలో 2025 ఆగస్టు 20న విడుదల చేశారు. పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ.79,999 ఉండగా, ప్రో మోడళ్ల ధరలు రూ.1,09,999 నుండి రూ.1,72,999 వరకు ఉన్నాయి. ఈ పిక్సెల్ 10 శ్రేణి మొత్తం గూగుల్ అత్యాధునిక టెన్సర్ 5 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెరుగైన కెమెరా పనితీరుపై దృష్టి సారిస్తుంది.