GST: నేటి నుంచే కొత్త జీఎస్టీ.. సామాన్యులకు పండుగే

200+ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు.. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ తక్కువ ధర... ఆరోగ్య & బీమా ఖర్చులు తగ్గాయి

Update: 2025-09-22 06:00 GMT

సె­ప్టెం­బ­ర్ 22 అర్థ­రా­త్రి నుం­చి కొ­త్త జీ­ఎ­స్టీ శ్లా­బ్‌­లు అమ­ల్లో­కి వచ్చా­యి. ఈసా­రి ప్ర­భు­త్వం తీ­సు­కు­న్న ని­ర్ణ­యం పేద, మధ్య­త­ర­గ­తి వర్గా­ల­కు వి­శేష ఊర­ట­ను కలి­గిం­చే­లా ఉంది. నె­ల­వా­రీ ఖర్చు­ల­తో సత­మ­త­మ­వు­తు­న్న సా­మా­న్యు­ల­కు ఈ మా­ర్పు­లు ని­జం­గా గి­ఫ్ట్‌­లాం­టి­వే. ప్ర­ధా­ని మోదీ దీ­పా­వ­ళి సం­ద­ర్భం­గా పె­ద్ద బహు­మ­తి ఇస్తా­మ­ని ప్ర­క­టిం­చ­గా.. అం­త­కు ముం­దు­గా­నే దసరా పం­డ­గ­కు తగ్గిన ధర­ల­తో వస్తు­వు­లు అం­దు­బా­టు­లో­కి రా­ను­న్నా­యి. ఈసా­రి ప్ర­భు­త్వం జీ­ఎ­స్టీ శ్లా­బ్‌­ల­ను సర­ళీ­క­రిం­చి కే­వ­లం 5% , 18% రెం­డు కే­ట­గి­రీ­ల్లో ఉం­చిం­ది. దా­దా­పు 200 పైగా ని­త్యా­వ­సర, వి­ని­యోగ వస్తు­వు­ల­పై పన్ను తగ్గిం­చి ప్ర­జ­ల­పై ఆర్థిక భారం తగ్గిం­చ­డ­మే లక్ష్యం­గా తీ­సు­కు­న్న ఈ ని­ర్ణ­యం వ్యా­పార రం­గం­లో­నూ కొ­త్త ఉత్సా­హా­న్ని రగి­లి­స్తోం­ది.

నిత్యావసరాలపై ఊరట

షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, రేజర్లు, బేబీ డైపర్లు వంటి రోజువారీ ఉపయోగించే వస్తువులు ఇప్పుడు చౌకగా లభించనున్నాయి. అదేవిధంగా టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే అనేక తయారీ సంస్థలు కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎల­క్ట్రా­ని­క్స్ & ఆటో­మొ­బై­ల్ రంగం28% శ్లా­బ్‌­లో ఉన్న అనేక గృ­హో­ప­క­ర­ణా­లు ఇప్పు­డు 18%కి వస్తు­న్నా­యి. ఎయి­ర్ కం­డి­ష­న­ర్లు, రి­ఫ్రి­జి­రే­ట­ర్లు, డి­ష్‌­వా­ష­ర్లు, పె­ద్ద స్క్రీ­న్ టీ­వీ­లు, సి­మెం­ట్ వంటి ఉత్ప­త్తు­లు ఇం­దు­లో ఉన్నా­యి. ఆటో­మొ­బై­ల్ రం­గం­లో కూడా చి­న్న కా­ర్లు, ద్వి­చ­క్ర వా­హ­నా­లు తక్కువ పన్ను­తో మా­ర్కె­ట్‌­లో­కి రా­ను­న్నా­యి. లగ్జ­రీ కా­ర్ల­పై మా­త్రం అధిక పన్ను కొ­న­సా­గు­తుం­ది.

భీమా & మెడికల్ సెక్టార్‌లో పెద్ద ఊరట

ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు వంటి వాటిపై పన్ను పూర్తిగా రద్దు చేయడం మధ్యతరగతి వర్గానికి పెద్ద ప్లస్‌గా మారనుంది. అదే విధంగా యాంటీ-క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి కీలక మెడికల్ ఉత్పత్తులపై కూడా జీఎస్టీ లేకపోవడం వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

రైతులు, విద్యార్థులకు బూస్ట్

రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. విద్యార్థుల కోసం నోట్‌బుక్స్, ఎరేసర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్ వంటి విద్యా సామగ్రిపై కూడా ఇదే తగ్గింపు వర్తించనుంది. దీని వల్ల రైతులు, విద్యార్థులు ఆర్థికంగా ఊపిరి పీల్చే అవకాశం ఉంది. అధిక పన్ను­తో వి­లాస వస్తు­వు­లు­ఇక సి­గ­రె­ట్లు, బీ­డీ­లు, గు­ట్కా, పాన్ మసా­లా, చక్కెర కలి­గిన కా­ర్బొ­నే­టె­డ్ డ్రిం­క్స్, పె­ద్ద కా­ర్లు, హె­లి­కా­ప్ట­ర్లు, యా­ట్స్ వంటి వి­లాస వస్తు­వు­ల­పై 40% ప్ర­త్యేక పన్ను వి­ధిం­చ­ను­న్నా­రు. మొత్తంగా, కొత్త జీఎస్టీ 2.0 ప్రజలకు నేరుగా చేరే ఊరట ప్యాకేజీగా కనిపిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలు దసరా పండగను మరింత హ్యాపీగా జరుపుకునేలా చేయడమే కాకుండా.. వ్యాపార రంగానికి కూడా కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది. కొత్త జీఎస్టీ రేట్ల అమలుతో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ఖర్చులో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ కొనుగోలు చేయగలరు. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భద్రత పెరగడం ద్వారా దసరా పండగ వేడుకలకు మరింత ఉత్సాహం వస్తుంది.

Tags:    

Similar News