Plastic Exchange: నో మనీ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నచ్చిన వస్తువులు కొనుగోలు..

Plastic Exchange: ప్రభుత్వ నిర్ణయానికి తోడు ప్రజల సహకారం కూడా తోడైతేనే ఏపని అయినా, పథకం అయినా సక్సెస్ అవుతుంది.

Update: 2022-07-04 06:48 GMT

Plastic Exchange: ప్రభుత్వ నిర్ణయానికి తోడు ప్రజల సహకారం కూడా తోడైతేనే ఏపని అయినా, పథకం అయినా సక్సెస్ అవుతుంది. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ని వినియోగించరాదని ప్రభుత్వం నెత్తీ నోరు మొత్తుకుంటున్నా ఆచరణలో సాధ్యం కావట్లేదు.. మానవుని జీవితాలు ప్లాస్టిక్ తో మమేకం అయిపోయాయి. ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని రూపు మాపేందుకు గుజరాత్ కేఫ్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ వ్యర్ధాలు తీసుకువస్తే మీకు నచ్చిన ఆహార పదార్థాలను తీసుకువెళ్లవచ్చు అని చెబుతోంది.

కొంతమంది పాత బట్టలు మార్చి కొత్త పాత్రల కొనుగోలు చేస్తుంటారు. ఈ వస్తు మార్పిడి విధానం ఇప్పటికీ చాలా చోట్ల అమలులో ఉంది. సాధారణ రోజువారీ జీవితంలో ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు, ఆహారం కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.

గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేఫ్ ప్లాస్టిక్ వ్యర్థాలను పరిష్కరించడానికి సృజనాత్మక మైన ఆలోచనతో ముందుకు వచ్చింది. నేచురల్ ప్లాస్టిక్ కేఫ్ పేరుతో దీనిని నడిపిస్తున్నారు. కాబట్టి, కస్టమర్‌లు డబ్బుతో బిల్లులు చెల్లించే బదులు, కేఫ్‌లో ఏదైనా ఆహార వస్తువు కొనుగోలు చేయాలనుకుంటే నగదుకు బదులు ప్లాస్టిక్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

జునాగఢ్ కలెక్టర్ రచిత్ రాజ్ సోషల్ మీడియాలో కేఫ్ గురించి ట్వీట్ చేశారు. ఒక వినియోగదారు ఇలా అన్నారు, "అది ఉత్తమ నిర్ణయం. అయితే ప్లాస్టిక్‌ని సేకరించిన తర్వాత మీరు ఏమి చేస్తారో దయచేసి మాకు చెప్పగలరా?

కేఫ్‌ను సర్వోదయ్ సఖి మండల్‌కు చెందిన మహిళల బృందం నిర్వహిస్తుంది. ఇక కేఫ్ ఆఫర్ చేసే మెనూ విషయానికి వస్తే అనేక సాంప్రదాయ గుజరాతీ వంటకాలైన సెవ్ టామెటా, బైంగన్ భర్తా, తేప్లా మరియు బజ్రా రోట్లా వంటి విభిన్న వంటకాలు రుచికరంగా, వేడి వేడిగా వడ్డిస్తారు.

ఆరోగ్యకరమైన అత్తి పండ్ల, బెల్ ఆకు, తమలపాకుతో చేసిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి. కేఫ్ లో అన్ని వంటకాలు మట్టి పాత్రలలో వడ్డిస్తారు. వంటకాలకు కావలసిన పదార్థాలు స్థానికంగా పండించినవి, తయారు చేసినవి ఉంటాయి. పర్యావరణ హితం కోసం మీరు భాగస్వాములుకండి అని కేఫ్ నిర్వాహకులు ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు.

Tags:    

Similar News