hero pleasure : హీరో ప్లెజర్ స్కూటర్.. మార్కెట్లోకి సరికొత్తగా..

hero pleasure : హీరో మోటోకార్ప్ ప్లెజర్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ని మార్కెట్లో విడుదల చేసింది.

Update: 2021-10-12 07:25 GMT

hero pleasure : టూ వీలర్ ప్రియుల కోసం మార్కెట్లోకి కొత్తగా హీరో స్కూటర్ ప్లెజర్ వచ్చేసింది. హీరో మోటోకార్ప్ ప్లెజర్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ని మార్కెట్లో విడుదల చేసింది. 110 సీసీ ఇంజన్‌తో ప్లెజర్ + ఎక్స్‌టెక్ స్కూటర్ రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటు బ్లూటూత్ అనుసంధానత, హీరో ఐ3ఎస్ టెక్నాలజీతో మెరుగైన ఇంధన సామర్ధ్యం కలిగి ఉంది. రెండు మోడళ్ల ధరలు వరుసగా రూ.61,900, రూ.69,500గా నిర్ణయించారు.

Tags:    

Similar News