ఇల్లు కొనుగోలు ఆలస్యం చేయొద్దు.. 15 శాతం పెరగొచ్చంటున్న విశ్లేషకులు..
ఇంటి నిర్మాణానికి అవసరమైన ముడి సరుకు వ్యయం భారీగా పెరుగుతున్నందున దాని ప్రభావం ఇంటి ధరపై పడుతుంది.;
ఇంటి నిర్మాణానికి అవసరమైన ముడి సరుకు వ్యయం భారీగా పెరుగుతున్నందున దాని ప్రభావం ఇంటి ధరపై పడుతుంది. కొవిడ్ మహమ్మారి కారణంగా ఇళ్ల కొనుగోళ్లు కాస్త నెమ్మదించినా గత 4,5 నెలలుగా అమ్మకాలు పుంజుకోవడం రియల్టర్లలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇళ్ల అమ్మకాలు నెమ్మదించినప్పటికీ దిగ్గజ బ్రాండ్ డెవలపర్ల మార్కెట్ వాటా పెరిగింది. గృహాల ధరలు పెరగడం అనివార్యం. నిర్మాణ ఖర్చులు భారీగా పెరగడం ఇందుకు కారణమని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ముడి సరుకు వ్యయాలు, సరఫరా కొరత కూడా ధరలపై ప్రభావం చూపించొచ్చని అంటున్నారు. స్థిరాస్థి అభివృద్ధి సంస్థలు చిన్నవైనా, పెద్దవైనా అత్యుత్తమ ట్రాక్ రికార్డు ఉంటే తప్పకుండా రాణిస్తాయని తెలిపారు. ముడి సరుకు ధరలు ప్రియం కావడంతో రాబోయే ఏడాది కాలంలో గృహాల ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రాపర్టీ డెవలపర్లు పేర్కొంటున్నారు.