Honda : దీపావళి బంపర్ ఆఫర్.. హోండా కార్లపై రూ.1.32 లక్షల వరకు తగ్గింపు.
Honda : దీపావళికి కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ హోండా కార్స్ ఇండియా తమ వినియోగదారుల కోసం దీపావళి 2025 సెలబ్రేషన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కారణంగా జీఎస్టీ 2.0 తర్వాత కొన్ని మోడళ్ల ధరలు మరింత తగ్గాయి. ఈ పండుగ సీజన్‌ను వినియోగించుకోవడానికి, హోండా తమ కార్ల మీద రూ.1.32 లక్షల వరకు భారీ తగ్గింపులు, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.
హోండా ఎలివేట్ : మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన ఎలివేట్‌పైనే అత్యధిక ఆఫర్ ఉంది. టాప్-స్పెక్ ZX ట్రిమ్ కొనుగోలుపై కస్టమర్‌లు రూ.1.32 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. V, VX ట్రిమ్స్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ, కార్పొరేట్ స్కీమ్‌ల కింద రూ.57,000, రూ.73,000 వరకు తగ్గింపు లభిస్తోంది. బేస్ SV వేరియంట్‌పై కూడా రూ.25,000 తగ్గింపు ప్రకటించారు. దీని వల్ల మొత్తం ఎలివేట్ రేంజ్ మరింత చౌకగా మారింది.
సిటీ, ఇతర మోడళ్లు :
సిటీ సెడాన్ టాప్-ఎండ్ ZX వేరియంట్‌పై కూడా రూ.1.02 లక్షల వరకు లాభాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ ఆఫర్లు, 7 సంవత్సరాల వారంటీ (దీని విలువ రూ.28,000) వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, సిటీ e:HEV హైబ్రిడ్ వేరియంట్‌పై ఈ నెల క్యాష్ డిస్కౌంట్ లేదు.. కానీ కంపెనీ ఇప్పటికే జూలైలో ధరలు తగ్గించడంతో పాటు, 7 సంవత్సరాల వారంటీని కొనసాగిస్తోంది.
అమేజ్ : కాంపాక్ట్ సెడాన్ అయిన అమేజ్ కొనుగోలుదారులకు కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు లభిస్తున్నాయి. పాత సెకండ్ జనరేషన్ S ట్రిమ్‌పై రూ.97,200 వరకు లాభాలు ఉన్నాయి. కొత్త థర్డ్ జనరేషన్ మోడల్‌పై మొత్తం రూ.67,200 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా, కొత్త జనరేషన్ టాప్-స్పెక్ అమేజ్ ZX CVT ధరను ఏకంగా రూ.25,000 తగ్గించారు. ఇప్పుడు దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు.
యాక్సెసరీస్, ప్రీమియం ఫీచర్లపై ఆదా : పండుగ సీజన్‌ను ఉపయోగించుకుంటూ.. హోండా యాక్సెసరీస్ ధరలను కూడా తగ్గించింది. ఆల్ఫా-బోల్డ్ ప్లస్ గ్రిల్‌ను రూ.16,500 బదులు రూ.9,900కే అందిస్తున్నారు. అలాగే, స్పోర్టీ లుక్ ఇచ్చే సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీ ధర కూడా రూ.36,500 నుంచి రూ.29,900కి తగ్గింది. అంతేకాదు, 360-డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి.