Honda Elevate : క్రెటా, సెల్టోస్‌కు చెక్ .. మార్కెట్లోకి హోండా ఎలివేట్ స్పెషల్ ఎడిషన్.

Update: 2025-11-03 08:00 GMT

Honda Elevate : హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో గట్టిగా పోటీ పడేందుకు హోండా కార్స్ ఇండియా రెడీ అవుతుంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన టీజర్ ఇమేజ్‌లు హోండా ఎలివేట్ స్పెషల్ ఎడిషన్ త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు సూచిస్తున్నాయి. బోల్డ్ లుక్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ కొత్త ఎడిషన్‌కు ఎలివేట్ బోల్డ్ ఎడిషన్ లేదా ఎలివేట్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. లోపల, బయట స్పోర్టీ రెడ్ హైలైట్స్, మరిన్ని ప్రత్యేక ఫీచర్స్‌తో వస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీ వివరాలు చూద్దాం.

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి హోండా కార్స్ ఇండియా ఎలివేట్ ఎస్‌యూవీకి ఒక కొత్త వెర్షన్‌ను తీసుకురాబోతోంది. ఈ మోడల్ పేరు ఎలివేట్ బోల్డ్ ఎడిషన్ లేదా ఎలివేట్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్గా ఉండవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్ కారు ప్రధానంగా బోల్డ్ లుక్‌పై దృష్టి సారించింది. లోపల, వెలుపల స్పోర్టీ రెడ్ ట్రీట్‌మెంట్‌తో వస్తుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. కొత్త హోండా ఎలివేట్ స్పెషల్ ఎడిషన్‌లో ఎక్సటర్నల్, ఇంటర్నల్ డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి.

ముందు గ్రిల్, బోనెట్‌పై రెడ్ కలర్ యాక్సెంట్లు ఉంటాయి. ముఖ్యంగా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కూడా రెడ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కారు లోపల డ్యుయల్-టోన్ థీమ్‌ను ఉపయోగించవచ్చు. ఇది పూర్తిగా ఆల్-బ్లాక్ లేదా ఎరుపు హైలైట్‌లతో కూడిన ఆల్-బ్లాక్ థీమ్‌తో రావచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్‌లో కేబిన్ లేఅవుట్, ఫీచర్లు ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్టే కొనసాగే అవకాశం ఉంది. హోండా ఎలివేట్‌లో ఇప్పటికే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, 7.0-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, సింగిల్-పాన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారులో లేన్-వాచ్ కెమెరా, హోండా అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సూట్ హోండా సెన్సింగ్ కూడా అందుబాటులో ఉంది. కొత్త స్పెషల్ ఎడిషన్‌లో ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇది సిటీ సెడాన్‌లో ఉన్న అదే పవర్ఫుల్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. హోండా ఎలివేట్‌లో 1.5-లీటర్, నాలుగు-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 121 బీహెచ్‌పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. పవర్ ముందు చక్రాలకు అందుతుంది.

హోండా భవిష్యత్తులో ఎలివేట్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ హైబ్రిడ్ వెర్షన్‌ను 2026 రెండవ భాగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో సిటీ ఈ:హెచ్‌ఈవీ (City e:HEV) లో ఉన్నటువంటి 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారు ఉండే అవకాశం ఉంది. ఈ హైబ్రిడ్ వెర్షన్‌కు ప్రత్యేకమైన హైబ్రిడ్ బ్యాడ్జింగ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవచ్చు.

Tags:    

Similar News