Indigo : ఇండిగో బంపర్ సేల్.. రూ. 2,390కే దేశంలో ఎక్కడికైనా..ఆఫర్ డీటెయిల్స్ ఇవే

Update: 2025-10-13 10:57 GMT

Indigo : ఈ దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్ ఒక స్పెషల్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు 'ఫ్లయింగ్ కనెక్షన్స్ సేల్'. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 13న ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారు నవంబర్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 మధ్య తమ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా దేశీయ విమాన టికెట్లు కేవలం రూ.2,390 నుంచి ప్రారంభమవుతుండగా, అంతర్జాతీయ టికెట్లు రూ.8,990 నుంచి అందుబాటులో ఉన్నాయి.

ఇండిగో ఈ ఫ్లయింగ్ కనెక్షన్స్ సేల్‎లో దాదాపు 90 దేశీయ, 40కి పైగా అంతర్జాతీయ నగరాలను కలుపుతూ 8,000 కంటే ఎక్కువ రూట్‌లను చేర్చింది. అంటే, చిన్న నగరాల నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాల వరకు ప్రయాణాన్ని చాలా సులభంగా, చవకగా చేయవచ్చన్నమాట. కనెక్టింగ్, మల్టీ-సిటీ ప్రయాణాలను సులభతరం చేయడం ద్వారా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలకు వెళ్లే అవకాశాన్ని ఈ ఆఫర్ కల్పిస్తుంది.

దేశంలోపల ప్రయాణించడానికి ప్లాన్ చేస్తున్నవారికి ఈ సేల్‌లో కొన్ని ముఖ్యమైన చౌకైన రూట్‌లు అందుబాటులో ఉన్నాయి. కోచి నుంచి శివమొగ్గ కేవలం రూ.2,390 నుంచి ప్రారంభమవుతుంది. లక్నో నుంచి రాంచీ, పాట్నా నుంచి రాయ్‌పూర్ టికెట్లు రూ.3,590కే లభించవచ్చు. కోచి నుంచి విశాఖపట్నం (వైజాగ్) ఫ్లైట్ రూ.4,090 నుంచి ప్రారంభమవుతుంది. జైపూర్ నుంచి రాయ్‌పూర్ మరియు అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ విమానాలు రూ.4,190 నుంచి రూ.4,490 మధ్య ప్రారంభమవుతాయి.

అంతర్జాతీయ ప్రయాణికులకు ఇండిగో ఈ సేల్‌లో అద్భుతమైన తగ్గింపులను ప్రకటించింది. కోచి నుంచి సింగపూర్ విమానం రూ.8,990 నుంచి ప్రారంభమవుతాయి. అహ్మదాబాద్ నుంచి సింగపూర్ టికెట్ రూ.9,990, జైపూర్ నుంచి సింగపూర్ రూ.10,190 నుంచి మొదలవుతుంది. లక్నో నుంచి హనోయ్ రూ.10,990, జైపూర్ నుంచి హనోయ్ రూ.11,390, అహ్మదాబాద్ నుంచి హనోయ్ రూ.11,790. పాట్నా నుంచి హో చి మిన్ సిటీ రూ.13,690 వరకు టిక్కెట్లు లభిస్తాయి. యూరప్‌కు కూడా ఆఫర్ జైపూర్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు విమానం రూ.15,590 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ ఫ్లయింగ్ కనెక్షన్స్‌ సేల్ ఆఫర్ కేవలం ఇండిగో నడిపే కనెక్టింగ్ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది, కోడ్‌షేర్ లేదా డైరెక్ట్ ఫ్లైట్‌లకు కాదు. టికెట్ బుకింగ్‌లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ వన్-వే, రౌండ్ ట్రిప్ బుకింగ్‌లకు చెల్లుతుంది. ఈ ఆఫర్‌ను ఇండిగో ఇతర ప్రమోషన్‌లు లేదా డిస్కౌంట్‌లతో కలిపి ఉపయోగించడానికి వీలు లేదు. ముఖ్యంగా, బుక్ చేసిన టికెట్లను మార్చడానికి లేదా రద్దు చేయడానికి వీలు ఉండదు. రిఫండ్ కూడా రాదు. ఒకవేళ ప్రయాణంలో మార్పులు చేయాలంటే అదనపు రుసుము, ఛార్జీల వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గ్రూప్ బుకింగ్‌లకు ఈ ఆఫర్ వర్తించదు. ప్రయాణికులు వీసా, ఆరోగ్య, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

Tags:    

Similar News