iPhone 16 : వావ్.. సెప్టెంబర్ 20 నుంచి ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు

Update: 2024-09-14 12:30 GMT

యాపిల్ కంపనీ ఇటీవల విడుల చేసిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు భారత్లో సెప్టెంబర్ 20 నుంచి అందు బాటులోకి రానున్నాయి. ఇందుకు ముందుస్తు బుకిం గ్స్ ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 16లో నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కస్టమర్లకు 20 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ సదుపాయంతో ముందుగా వీటిని యాపిల్ స్టోర్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు కంపెనీ రిటైల్ అవుట్ లెట్స్ ఉన్న బీకేసీ, ముంబై, సాకేత్ ఢిల్లీలో ఉన్న స్టోర్స్ లోనూ బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు యాపిల్ ఐఫోన్ భాగస్వామ్య స్టోర్లు, ఇ-కామర్స్ సైట్స్, టాటా క్రోమ్, విజయ్ సేల్స్ వంటి రిటైల్ చైయిన్ స్టోర్స్ ల్లోనూ వీటిని బుక్ చేసుకోవచ్చు. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా 5,000 రూపాయల నగదు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నాయి.

మూడు, ఆరు నెలల ఈఎంఐపై యాపిల్ నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తోంది. పాత ఐఫోన్ల ఎక్స్చేంజ్ పై యాపిల్ కంపెనీ మోడల్ను బట్టి 67,500 రూపాయల వరకు కస్టమర్లు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ను కొత్త ఫోన్ ధరలో తగ్గిస్తారు. ఐఫోన్ 16 ధరలు 79,900 నుంచి 1,09,900 వరకు, 16 ప్లస్ ధరలు 89,900 నుంచి 1,19,900 రూపాయల వరకు, ఐఫోన్ 16 ప్రో ధరలు 1,19,900 నుంచి 1,69,900 వరకు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరలు 1,44,900 నుంచి 1,84,900 రూపాయల వరకు ఉన్నాయి. సో.. లేటెందుకు.. కొత్త ఫోన్ కొనుక్కునేందుకు ఈ బిగ్ సేల్ లో సిద్ధమైపోండి.

Tags:    

Similar News