Nissan : నిస్సాన్ కొత్త 7-సీటర్ MPV వస్తోంది..ఇక ట్రైబర్, ఎర్టిగాకు గట్టి పోటీ తప్పదా?
Nissan : నిస్సాన్ కంపెనీ నేడు భారత మార్కెట్లో తన మొట్టమొదటి మాస్-మార్కెట్ 7-సీటర్ MPV (మల్టీ పర్పస్ వెహికల్)ని ఆవిష్కరించనుంది. ఈ రాబోయే మోడల్ రెనో ట్రైబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ట్రైబర్‌తో కోర్ ప్లాట్‌ఫారమ్, ఇంజన్ వంటి మెకానికల్ భాగాలను పంచుకుంటుంది. నిస్సాన్ ఇప్పటివరకు ఈ కారుకు సంబంధించిన కొన్ని చిత్రాలను మాత్రమే విడుదల చేసింది. అయితే కంపెనీ టెక్టన్ కాంపాక్ట్ SUV కాన్సెప్ట్‌ను అనుసరిస్తున్నందున, నేటి ఆవిష్కరణలో పూర్తి ఉత్పత్తిని చూపకుండా, ప్రధానంగా డిజైన్ స్కెచ్‌లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎంపీవీ అధికారిక పేరును కూడా నిస్సాన్ ప్రకటించే అవకాశం ఉంది.
భారతదేశంలో నిస్సాన్ అనుసరిస్తున్న విస్తృత ఉత్పత్తి వ్యూహంలో ఈ కొత్త MPV ఒక భాగం. దీని ప్రకారం కంపెనీ రాబోయే రెండేళ్లలో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది. ట్రైబర్ ఆధారిత ఈ ఎంపీవీ మొదటిది కానుంది. దీనిని 2026 ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీని తరువాత, రెనో డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన టెక్టన్ కాంపాక్ట్ SUV 2026 జూన్ నాటికి విడుదల కానుంది. పైప్‌లైన్‌లో ఉన్న మూడవ ఉత్పత్తి 2027 ప్రారంభంలో విడుదల కాగల కొత్త 7-సీటర్ SUV. మార్కెట్‌లో లాంచ్ అయిన తర్వాత, నిస్సాన్ ఈ కొత్త ఎంపీవీ రెనో ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, నిస్సాన్ ఎంపీవీలో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్, సెంటర్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. ఇందులో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 71hp పవర్, 96Nm టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది. సేఫ్టీ కోసం, ఈ కొత్త ఎంపీవీలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.