iQOO నుంచి మరో స్మార్ట్ ఫోన్ ఇండియా లో రిలీజైంది IQOO Neo7 Pro
iQOO నియో 7 ప్రొ పేరుతో ఈ మొబైల్ ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది;
iQOO నుంచి మరో స్మార్ట్ ఫోన్ ఇండియా లో రిలీజైంది, iQOO నియో 7 ప్రొ పేరుతో ఈ మొబైల్ ను పరిచయం చేసింది. iQOO నియో 7 ప్రొ 5జీ 8gb +128 gb,12gb + 256 gb రెండు వేరియన్ ట్లలో లబిస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ ( snapdragon ) 8+gen 1 ప్రొసెసర్ తో పాటు, 5000 mah బాటరీ, స్మార్ట్ 3 d కూలింగ్ సిస్టమ్, ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ సెట్ తో లభిస్తుంది.
iQOO నియో 7 ప్రొ 5జీలో 50 mp మెయిన్ కెమేరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ + 8 mp అల్ట్రా వైడ్ + 2 mp మాక్రో కెమేరా తో పాటూ 16 mp ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా తో లభిస్తుంది. బ్లూటూత్ 5.2, వైఫై 6, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, మోషన్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం 8 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు, 25 నిమిషాల్లో 1 నుంచి 100 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
iQOO నియో 7 ప్రొ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.34,999 కాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) సందర్భంగా రూ.31,999 ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు.
ఆఫర్ వివరాలు చూస్తే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.34,999 కాగా జూలై 18 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద రూ.1,000, బ్యాంక్ డిస్కౌంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. రూ.31,999 ధరకే 8జీబీ+128జీబీ వేరియంట్ కొనొచ్చు.
ఇక 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.37,999 కాగా జూలై 18 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద రూ.1,000, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ డిస్కౌంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. రూ.34,999 ధరకే 12జీబీ+256జీబీ వేరియంట్ కొనొచ్చు.