Jio: జియో కొత్త ప్లాన్.. ఇప్పటినుండి పూర్తి నెలకు..
Jio: జియో కొత్తగా రూ.259 రిచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.;
Jio: తక్కువకాలంలోనే నెట్‌వర్కింగ్ కంపెనీల్లో సంచలనం సృష్టించింది జియో. నెలరోజులు ఉపయోగించే 1 జీబీ డేటాను ఒక్కరోజు ఉపయోగించుకునేలా ప్లాన్‌ను ప్రవేశపెట్టి నెట్‌వర్కింగ్ కంపెనీలకు పోటీగా నిలిచింది. అంతే కాదు ఇప్పటికీ.. ఏదో ఒక కొత్త ప్లాన్‌తో యూజర్స్‌ను ఆకర్షిస్తూనే ఉంటుంది జియో. తాజాగా ఓ కొత్త ప్లాన్‌తో జియో తన యూజర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
జియో కొత్తగా రూ.259 రిచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను ఒకేసారి ఎన్ని నెలల కోసమైన రిచార్జ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి ఈ ప్యాక్ వాలిడిటీ అయిపోగానే ఆటోమాటిక్‌గా దానంతట అదే రెన్యువల్ అవుతుందన్నమాట. అంతే కాకుండా ఇది మునుపటిలాగా 28 రోజుల ప్లాన్ కాదు.. క్యాలెండర్ మంత్ వాలిడిటీ.
జియో ప్రవేశపెట్టిన రూ. 259 అనే కొత్త ప్లాన్ పూర్తిగా నెలరోజుల పాటు వస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో రోజుకు 100 మెసేజ్‌లు, 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్లాన్‌తో రిచార్జ్ చేసుకున్నవారికి ఫ్రీగా జియో యాప్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. పూర్తిగా నెలరోజులు వచ్చే ప్లాన్ కావడంతో యూజర్స్ ఎక్కువగా దీనికి ఆకర్షితులయ్యే అవకాశం ఉందని జియో అనుకుంటోంది.