Kawasaki : కవాసకి కొత్త మోడల్ రిలీజ్..ఈ ధరతో ఓ లగ్జరీ కారు కారు కొనేయొచ్చు.

Update: 2025-10-24 10:30 GMT

Kawasaki : భారతీయ బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ జపాన్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కవాసకి దేశంలో తన కొత్త 2026 Z900 బైక్‌ను విడుదల చేసింది. మిడ్-వెయిట్ నేకెడ్ సెగ్మెంట్‌లో ఈ బైక్‌కు మంచి ఆదరణ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు. 2025 మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2026 వెర్షన్‌లో పెద్దగా మెకానికల్ మార్పులు లేనప్పటికీ, కొత్త కలర్ ఆప్షన్లు, ధర తగ్గింపుతో వినియోగదారులను ఆకర్షించేందుకు కవాసకి ప్రయత్నిస్తోంది.

కవాసకి భారతదేశంలో విడుదల చేసిన 2026 Z900 బైక్‌లో 2025 మోడల్‌లో ఉన్న అప్‌డేట్‌లనే కొనసాగించారు. ఈ బైక్‌లో 948సీసీ, ఇన్‌లైన్-4, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 125 హెచ్‌పీ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కవాసకి ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. ఇది గత సంవత్సరం మోడల్ కంటే 1 హెచ్‌పీ పవర్, 1.2 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు.

కొత్త Z900లో రైడర్‌కు అద్భుతమైన కంట్రోల్ అందించే ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లో రైడ్-బై-వైర్ థ్రాటిల్, క్రూయిజ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, పవర్ మోడ్స్, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కవాసకి 2026 Z900 మోడల్‌ను రెండు కొత్త కలర్ స్కీమ్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకటి, కవాసకికి ప్రసిద్ధి చెందిన క్యాండీ గ్రీన్ కలర్‌ను తిరిగి పరిచయం చేసింది.ఇది 2025 మోడల్‌లో లేదు. రెండు, బ్లాక్ పెయింట్‌తో గోల్డ్ ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఇచ్చింది, ఇది బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

గత నెలలో జీఎస్‌టీ రేట్ల మార్పు కారణంగా Z900 ధర రూ.9.52 లక్షల నుంచి రూ.10.18 లక్షలకు పెరిగింది. అయితే, ఇప్పుడు కవాసకి 2026 మోడల్‌ను మళ్లీ రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో విడుదల చేయడం ద్వారా వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కవాసకి బైక్‌లలో Z900 ఒకటి, ఈ ధర వ్యూహం కంపెనీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News