Lalith Modi : బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. బిజినెస్‌మెన్‌తో ''జస్ట్ డేటింగ్''
Lalith Modi : లలిత్ మోదీతో మాజీతో మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ డేటింగ్
Lalith Modi : బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసి.. తప్పించుకు తిరుగుతున్న లలిత్ మోదీతో మాజీతో మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ డేటింగ్లో ఉన్నారు. ఈ మేరకు వారు కలిసి దిగిన ఫోటోలను లలిత్ మోదీ ట్విట్టర్లో పోస్టుచేశాడు. తాము త్వరలో పెళ్లిచేసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇటీవల వారిద్దరు వివిధ దేశాల్లో చేసిన పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ....తాము ఇద్దరం పెళ్లిచేసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. మై బెటర్ ఆఫ్ పార్ట్నర్ అంటూ సుస్మితాసేన్ను సంబోదిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో వీరికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సుస్మితాసేన్ డిసెంబర్లో మోడల్, యాక్టర్ రోహ్మన్ శాల్‌తో బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బ్రేకప్‌కు ముందు సుస్మితా, రోహ్మన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా బాలీవుడ్లో పెద్ద టాక్ నడిచింది. ఇప్పుడు లలిత్ మోడీతో సుస్మితా డేటింగ్ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Just for clarity. Not married - just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022