మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే..!

మరోసారి సామాన్యుడికి షాక్ ఇచ్చాయి గ్యాస్ ధరలు.. సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగింది. పెరిగిన గ్యాస్ ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి రానున్నాయి.

Update: 2021-08-18 09:53 GMT

మరోసారి సామాన్యుడికి షాక్ ఇచ్చాయి గ్యాస్ ధరలు.. సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగింది. పెరిగిన గ్యాస్ ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో గ్యాస్ ధరలు రూ.859.50గా ఉండగా, కోల్‌కతాలో రూ.886కి చేరుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతుండడం, అదే స్థాయిలో గ్యాస్ ధరలు కూడా పెరుతుండడంతో సామాన్యుడికి గుదిబండ లాగా మారాయి. ఇకపోతే ఏపీలో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.893 వద్ద ఉంది. రేట్ల పెంపుతో ఈ రేటు రూ.913కు చేరింది. అంటే డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలుపుకుంటే సిలిండర్ ధర రూ.950కు చేరుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 వరకు సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది.

Tags:    

Similar News