LPG Gas Price: నెల గ్యాప్‌లో రెండోసారి గ్యాస్ సిలిండర్ ధరల పెంపు..

LPG Gas Price: పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల ధరలు మధ్య తరగతిపై దెబ్బ మీద దెబ్బలాగా పడుతూనే ఉన్నాయి.

Update: 2021-12-01 05:50 GMT

LPG Gas Price (tv5news.in)

LPG Gas Price: పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల ధరలు మధ్య తరగతిపై దెబ్బ మీద దెబ్బలాగా పడుతూనే ఉన్నాయి. కూరగాయలు, రిచార్జ్ ధరలు.. ఇలా ఒకటి కాకపోతే మరొకటి మధ్య తరగతిపై వేటు వేస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందులాగా చాలీచాలని జీతాలతో ఇల్లు గడిచే పరిస్థితి మారిపోయింది. తాజాగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కూడా ధరలను మరోసారి పెంచేసింది.

ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ ఉపయోగించే వారికి ఆ సంస్థ ఊహించని దెబ్బే వేస్తోంది. నవంబర్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్టుగా సంస్థ ప్రకటించింది. అలా రూ.100 పెరిగి నెల కాకముందే మరోసారి ధరలను పెంచుతున్నట్టుగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి రూ. 103.50 పెంచుతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,101 అయ్యింది.

ప్రతీ నెల మొదటి తేది గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. గత నెల, ఈ నెల చేసిన సమీక్షంలో ధరలను పెంచాలనే నిర్ణయాన్ని తీసుకున్నాయి. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఈరోజు నుండే అమల్లోకి రానున్నాయి. కాకపోతే ఇంటి అవసరాలకు ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు రాకపోవడం కాస్త సంతోషించాల్సిన విషయం.

Tags:    

Similar News