Mahindra : కేవలం రూ.7.99లక్షలకే మహీంద్రా నుంచి రెండు ధమాకా ఎస్యూవీలు

Update: 2025-10-07 07:45 GMT

Mahindra : భారతీయ కార్ల దిగ్గజం మహీంద్రా తమ పాపులర్ మోడల్ అయిన బోలెరో నియో, బోలెరో ఎస్‌యూవీలను కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్లలో చాలా మార్పులు చేసినప్పటికీ, మొత్తం లుక్ మాత్రం పాతదానిలానే ఉంది. కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేశామని మహీంద్రా సంస్థ తెలిపింది. ఫేస్‌లిఫ్ట్ చేసిన మహీంద్రా బోలెరో నియో, బోలెరో కొత్త ధరలు పాత మోడళ్లకు దగ్గరగా ఉన్నాయి. బోలెరో నియో ధర రూ.8.49 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండగా, బోలెరో ధర రూ.7.99 లక్షల నుంచి రూ.9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇంజిన్లలో మాత్రం మహీంద్రా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, ఈ రెండు ఎస్‌యూవీల సస్పెన్షన్‌ను మెరుగుపరచడానికి కంపెనీ కొత్త రైడ్‌ఫ్లో టెక్‎తో ట్యూన్ చేసింది.

మహీంద్రా బోలెరో నియోలో కొత్త ఫీచర్లు  డిజైన్, కలర్: కొత్త బోలెరో నియో ముందు భాగంలో ఉన్న గ్రిల్‌ను మార్చారు. కొత్త గ్రిల్‌కు క్రోమ్ అలంకరణ జోడించడం వల్ల ముందు నుంచి ఇది మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది. కొత్తగా జీన్స్ బ్లూ, కాంక్రీట్ గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను కూడా ఇందులో చేర్చారు. ఈ కొత్త ఆప్షన్లు N11 వేరియంట్‌లో లభిస్తాయి.

టాప్ వేరియంట్ స్పెషల్స్: కొత్త టాప్-ఎండ్ N11 వేరియంట్ డ్యూయల్-టోన్ పెయింట్, కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇంటీరియర్‌లో లూనార్ గ్రే థీమ్‌ను ఇచ్చారు. ఇది N11 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది.

ఇతర అప్‌డేట్స్: సీట్లలో ఇప్పుడు మెరుగైన కుషనింగ్ ఉంది. USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు. N10, N11 వేరియంట్‌లలో 8.9-అంగుళాల కొత్త టచ్‌స్క్రీన్, రియర్-వ్యూ కెమెరా కూడా ఉన్నాయి.

మహీంద్రా బోలెరోలో కొత్త ఫీచర్లు  మహీంద్రా బోలెరో ఫేస్‌లిఫ్ట్ లో స్టీల్త్ బ్లాక్ అనే సరికొత్త పెయింట్ షేడ్‌ను పరిచయం చేశారు. ఇది అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. బోలెరోలో కూడా కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, క్రోమ్ హైలైట్స్ ఉన్నాయి. కొత్తగా B8 వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. టాప్-స్పెక్ B8 వేరియంట్‌లో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, USB-C ఛార్జింగ్ పోర్ట్, లెదర్ సీట్ కవర్లు, మెరుగైన సీట్ కుషనింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అదనంగా ఇప్పుడు బోలెరో డోర్లలో బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు.

Tags:    

Similar News