Mahindra Scorpio N : స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ 2026.. ఈ సారి అదిరిపోయే ఫీచర్లు.. అస్సలు నమ్మలేరు.
Mahindra Scorpio N : థార్ ఫేస్‌లిఫ్ట్ తరువాత ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలైన XUV700, స్కార్పియో ఎన్ అప్‌డేటెడ్ వెర్షన్‌లపై దృష్టి పెట్టింది. 2026లో మార్కెట్‌లోకి రానున్న ఈ కొత్త స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో లోపల, బయట అనేక మార్పులు, మెరుగైన ఫీచర్లను యాడ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా డిమాండ్‌కు అనుగుణంగా పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లతో రాబోయే ఈ కొత్త ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
మహీంద్రా ప్రస్తుతం తన అగ్రశ్రేణి ఎస్‌యూవీలైన XUV700, స్కార్పియో ఎన్ అప్‌డేటెడ్ వెర్షన్‌ల టెస్టింగ్‌లో నిమగ్నమై ఉంది. కొత్త స్కార్పియో ఎన్ 2026లో విడుదల కానుంది. 2026 మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇటీవల భారీ కవరింగ్‌తో టెస్టింగ్ దశలో కనిపించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా విడుదల కానప్పటికీ, కొన్ని మీడియా నివేదికల ఆధారంగా మార్పులు అంచనా వేయవచ్చు.
కొత్త స్కార్పియో ఎన్ మొత్తం ఆకారం, స్టాన్స్ పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ముందు భాగంలో కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో ముందు భాగంలో ముఖ్యమైన మార్పులు, మెరుగైన లుక్‌తో రాబోతున్నట్లు స్పై చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇందులో కొత్తగా డిజైన్ చేయబడిన గ్రిల్, మరింత షార్ప్‌గా ఉండే రీడిజైన్ బంపర్, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, మహీంద్రా స్పెషల్ డీఆర్‌ఎల్స్ ఇవ్వవచ్చు.
కారు సైడ్ ప్రొఫైల్ పెద్దగా మారకపోవచ్చు, కానీ దీనికి కొత్త అల్లాయ్ వీల్స్‌ను జోడించే అవకాశం ఉంది. అంతేకాకుండా మహీంద్రా కొన్ని కొత్త వేరియంట్‌లను, సరికొత్త ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లను కూడా పరిచయం చేయవచ్చు. కొనుగోలుదారుల పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త స్కార్పియో ఎన్ క్యాబిన్‌లో అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లను జోడించనున్నారు.
లోపలి భాగంలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటివి లభించవచ్చు. ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యధికంగా డిమాండ్ ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను మహీంద్రా టాప్ వేరియంట్లలో జోడించే అవకాశం ఉంది. దీంతో పాటు అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు అయిన ఏడీఏఎస్ ను కూడా కొన్ని వేరియంట్లలో అందించవచ్చు.
ఇంజిన్ పనితీరు విషయంలో పెద్దగా మార్పులు లేకపోయినా, మెరుగైన మైలేజీపై దృష్టి పెట్టనున్నారు.కొత్త స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ప్రస్తుతం ఉన్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లే కొనసాగుతాయి. అయితే, ఈ రెండు ఇంజిన్‌లను మరింత మెరుగైన రిఫైన్‌మెంట్, మెరుగైన మైలేజ్‌తో ట్యూన్ చేసి అందించే అవకాశం ఉంది.
మహీంద్రా భవిష్యత్తు కోసం ఒక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా సిద్ధం చేస్తోంది. 2025 ఆగస్టు 15న మహీంద్రా విడుదల చేసిన విజన్ ఎస్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆధారంగా, కంపెనీ ఒక మినీ మహీంద్రా స్కార్పియోను తయారు చేస్తోంది. ఈ మినీ స్కార్పియో 2027లో మార్కెట్‌లోకి రావచ్చని అంచనా. ఈ ఎస్‌యూవీ కొత్త NU_IQ మోనోకాక్ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్ పై నిర్మించబడుతుంది. ఇది పెట్రోల్/డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌లు అన్నింటికీ సపోర్ట్ చేస్తుంది.