Mahindra XUV 7XO : మహీంద్రా XUV 7XO లాంచ్‌కు రెడీ..రూ.21,000తో బుకింగ్స్ షురూ.
Mahindra XUV 7XO : మహీంద్రా తన కొత్త SUV అయిన XUV 7XOను త్వరలో లాంచ్ చేయబోతోంది. ఈ కారు నిజానికి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటైన మహీంద్రా XUV700 కొత్త పేరు, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. భారతీయ ఆటో కంపెనీ తన ఈ అప్‌డేటెడ్ మోడల్‌తో XUV700 ప్రజాదరణను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ XUV 7XO ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే రూ.21,000 టోకెన్ మొత్తంతో ప్రారంభమయ్యాయి. కస్టమర్‌లు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ కొత్త SUV ధరలను మహీంద్రా జనవరి 5న ప్రకటించనుంది. అదే రోజు ఈ కారు లాంచ్ అవుతుంది.
మహీంద్రా విడుదల చేసిన టీజర్ వీడియో ద్వారా ఈ కొత్త XUV 7XOలో రాబోయే ప్రధాన మార్పులు స్పష్టమయ్యాయి. ఎస్‌యూవీలో కొత్త డ్యూయల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి, వీటితో పాటు ఇన్ వర్స్ L ఆకారంలో ఉన్న LED DRLలు (డే టైమ్ రన్నింగ్ లైట్స్) ఉంటాయి. ఈ డిజైన్ XUV700 కంటే పూర్తిగా భిన్నంగా , ఇటీవల లాంచ్ అయిన మహీంద్రా XEV 9S మోడల్‌ను పోలి ఉంటుంది. బయటివైపు ఇతర మార్పులలో XEV 9S లాంటి కొత్త LED టెయిల్-ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. అదనంగా సిల్వర్ స్లాట్‌లతో కూడిన కొత్త బ్లాక్-అవుట్ రేడియేటర్ గ్రిల్ డిజైన్, ఏరో కవర్‌లతో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్ కూడా కొత్త లుక్‌ను ఇస్తాయి.
టీజర్ వీడియోను బట్టి చూస్తే.. క్యాబిన్ లోపల కూడా SUVలో కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఉండే అవకాశం ఉంది. ఇది XEV 9S మోడల్‌లో ఉన్నట్లుగా ట్రిపుల్-స్క్రీన్ సెటప్ను కలిగి ఉండే అవకాశం ఉంది. కొత్త డిజైన్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, కొత్త డిజైన్ ఏసీ వెంట్స్, ఇతర మార్పులు కూడా కనిపిస్తాయి. XUV 7XO పాత మోడల్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ - రెండు ఫ్యూయల్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంటాయి.