Ather Rizta : 2 లక్షల మంది నమ్మకం.. ఇప్పుడు భారీ డిస్కౌంట్.. ఏథర్ రిజ్తా పై రూ. 34,000 వరకు ఆదా చేసే ఛాన్స్.

Update: 2026-02-21 07:45 GMT

Ather Rizta : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ స్కూటర్ రిజ్తా పై కనీవినీ ఎరుగని ఆఫర్లను ప్రకటించింది. ఈ స్కూటర్‌పై ఏకంగా రూ. 34,000 వరకు బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఇస్తోంది. ఇప్పటికే 2 లక్షల యూనిట్ల విక్రయాలతో రికార్డు సృష్టించిన రిజ్తా, ఇప్పుడు మరింత చవకగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ఛేంజ్ బోనస్ నుంచి క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ల వరకు ఏథర్ అందిస్తున్న ఆ ఆఫర్ల వివరాలేంటో ఓసారి చూద్దాం.

ఏథర్ రిజస్టా ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 1,19,546 నుంచి ప్రారంభమై రూ. 1,61,046 వరకు ఉంటాయి. అయితే, కంపెనీ ఇస్తున్న స్పెషల్ డీల్స్‌తో ఈ ధర భారీగా తగ్గుతుంది. కస్టమర్లు తమ పాత టూ వీలర్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 4,000 బోనస్‌తో పాటు గరిష్టంగా రూ. 30,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ లభిస్తుంది. దీనికి తోడు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ. 10,000 నుంచి రూ. 11,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు, రూ. 3,500 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా BaaS పద్ధతిలో ఈ స్కూటర్‌ను కొంటే ప్రారంభ ధర కేవలం రూ. 75,999 మాత్రమే. అయితే ఈ భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ప్రధానంగా 129 కిమీ రేంజ్ ఇచ్చే రిజ్తా S వేరియంట్‌పై అందుబాటులో ఉన్నాయి.

ఏథర్ రిజ్తా కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా టాప్ క్లాస్. ఇందులో రివర్స్ మోడ్ ఉండటం వల్ల పార్కింగ్‌లో వెనక్కి తీసుకోవడం చాలా ఈజీ. స్కిడ్ కంట్రోల్ టెక్నాలజీతో కూడిన టైర్లు వర్షాకాలంలో కూడా రోడ్డుపై గ్రిప్ కోల్పోకుండా చూస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో ఫాల్ సేఫ్టీ ఫీచర్ ఉంది. అంటే ప్రయాణంలో స్కూటర్ కింద పడితే మోటార్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. యాంటీ-థెఫ్ట్ ఫీచర్, లైవ్ లొకేషన్ షేరింగ్, మీ ఫోన్ ద్వారా పార్కింగ్‌లో ఉన్న స్కూటర్‌ను కనిపెట్టే సదుపాయం కూడా ఇందులో ఉన్నాయి.

రిజ్తాలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 2.9 kWh బ్యాటరీతో 123 కిమీ రేంజ్, 3.7 kWh బ్యాటరీతో 160 కిమీ రేంజ్ లభిస్తుంది. అన్ని వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఛార్జింగ్ విషయానికి వస్తే, పెద్ద బ్యాటరీ ప్యాక్ కేవలం 4 గంటల 30 నిమిషాల్లో ఫుల్ అవుతుంది. 7 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్న ఈ స్కూటర్‌పై కంపెనీ 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని ఇస్తోంది. ఇటీవలి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (OTA) తర్వాత ఇందులో కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, ఎకో మోడ్‌ను కూడా జోడించారు, ఇది రైడింగ్ రేంజ్‌ను మరింత పెంచడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News