EV Battery Care Tips : ఈవీ ఓనర్లా? మీ కారు బ్యాటరీ లైఫ్ పెంచే 7 అదిరిపోయే ట్రిక్స్ ఇవే.

Update: 2026-01-29 09:00 GMT

EV Battery Care Tips : ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పర్యావరణానికే కాదు, మీ జేబుకు కూడా చాలా మేలు చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇవీలు బెస్ట్ ఆప్షన్. అయితే ఒక ఎలక్ట్రిక్ కారును కొన్నంత మాత్రాన సరిపోదు, దాని బ్యాటరీని ఎలా కాపాడుకోవాలి, నిర్వహణ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో తెలియాలి. మీ ఈవీ బ్యాటరీ లైఫ్ పెంచి, మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను కాపాడే సూపర్ టిప్స్ ఇవే. మోడ్రన్ ఎలక్ట్రిక్ వాహనాలు మన ప్రయాణ అనుభవాన్ని మార్చేశాయి. తక్కువ శబ్దం, స్మూత్ డ్రైవింగ్‌తో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువే. అయితే ఇవీలో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే రీప్లేస్‌మెంట్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే బ్యాటరీని ఎప్పుడూ 20% నుంచి 80% మధ్యలోనే చార్జ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ 100% వరకు చార్జ్ చేయడం లేదా సున్నా వరకు వాడటం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అలాగే, వీలైనంత వరకు స్లో చార్జింగ్ వాడండి. అత్యవసరమైతే తప్ప ఫాస్ట్ చార్జింగ్ వాడకపోవడమే మంచిది, ఎందుకంటే ఇది బ్యాటరీని వేడి చేసి లోపల సెల్స్ దెబ్బతినేలా చేస్తుంది.

ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త: ఎలక్ట్రిక్ కార్లకు సాధారణ ఇన్సూరెన్స్ ప్లాన్లు సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఇందులోని ఎలక్ట్రానిక్ విడిభాగాలు చాలా ఖరీదైనవి. అందుకే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కవరేజ్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రమాదం జరిగి బ్యాటరీ దెబ్బతింటే, మీ జేబు నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే, కారు చార్జ్ అయిపోయి ఎక్కడైనా ఆగిపోతే సహాయం అందించే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉండేలా ప్లాన్ చేసుకోండి.

వాతావరణం కూడా ముఖ్యమే: అతిగా ఎండ ఉన్నప్పుడు కారును ఓపెన్ పార్కింగ్‌లో ఉంచకండి. ఎండ వేడి వల్ల బ్యాటరీ పవర్ త్వరగా తగ్గిపోతుంది. వీలైనంత వరకు నీడ ఉన్న చోట పార్క్ చేయండి. అలాగే, కారు వాడే ముందే దాన్ని ప్రీ-కండీషన్ చేయడం (కారు ఆన్ చేసి కొద్దిసేపు ఏసీ వేయడం వంటివి) వల్ల బ్యాటరీపై భారం తగ్గుతుంది. చల్లని వాతావరణంలో బ్యాటరీలోని కెమికల్ రియాక్షన్ నెమ్మదిగా ఉంటుంది, కాబట్టి అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.

టయర్లు,సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: పెట్రోల్ కార్ల కంటే ఈవీలు బ్యాటరీ బరువు వల్ల కొంచెం భారంగా ఉంటాయి. దీనివల్ల టయర్లు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఆరు నెలలకోసారి వీల్ అలైన్‌మెంట్ చెక్ చేయించుకోవాలి. అలాగే, మీ కారు తయారు చేసిన కంపెనీ ఇచ్చే ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇవి కారు పర్ఫార్మెన్స్‌ను పెంచడమే కాకుండా, చిన్న చిన్న టెక్నికల్ లోపాలను సరిచేస్తాయి. చివరగా, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఎక్కువగా వాడటం అలవాటు చేసుకోండి. ఇది మీరు బ్రేక్ వేసినప్పుడు వెలువడే శక్తిని మళ్ళీ బ్యాటరీకి పంపుతుంది, తద్వారా రేంజ్ పెరుగుతుంది.

Tags:    

Similar News