ట్విట్టర్‌కు పోటీగా..మెటా థ్రెడ్స్ యాప్..
సోషల్ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్ తీసుకొచ్చింది.దిగ్గజ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా టెక్ట్స్ ఆధారిత థ్రెడ్స్ పేరుతో మరో యాప్ తో ముందుకు వచ్చింది.;
సోషల్ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్ తీసుకొచ్చింది.దిగ్గజ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా టెక్ట్స్ ఆధారిత థ్రెడ్స్ పేరుతో మరో యాప్ తో ముందుకు వచ్చింది.దీనిని iOS, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.మెటా సంస్థ ఈ థ్రెడ్స్ యాప్‌ను ట్విట్టర్ తరహా ఫీచర్లతో ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా తీసుకొచ్చింది. థ్రెడ్స్ ఒకరకంగా ట్విట్టర్ కు పోటీగా ఉంటనుంది.