Milk Price Hike in Telugu States: పాల ధర కూడా పెంచుతారట.. పెంచుతున్న ధరలు చాల్లా..

Milk Price Hike in Telugu States..ఇప్పుడు మళ్లీ రేట్లు పెంచేస్తామంటే పొద్దున్నే ఓ రెండు చుక్కలు టీ నీళ్లు కూడా తాగేపన్లేదా అయ్యా అని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.

Update: 2021-02-20 11:14 GMT

Milk Price Hike in Telugu States

Milk Price Hike.. పిల్లలకి పాలు పట్టండి.. పాలు పౌష్టికాహారం.. ఎదిగే పిల్లలు రెండు పూట్లా పాలు తాగాలి.. ఇవన్నీ ఎవరికి సారు.. మీరింట్లా రేట్లు పెంచేస్తే ఒక్క పాకెట్ కొనడానికే నానా తంటాలు పడుతున్న పేద వాళ్లు.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెంచేస్తామంటే పొద్దున్నే ఓ రెండు చుక్కలు టీ నీళ్లు కూడా తాగేపన్లేదా అయ్యా అని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఏది కొందామని మార్కెట్‌కి వెళ్లినా రేట్లు డబుల్ చెబుతున్నారు. అదేమంటే చమురు ధరలు సాకుగా చూపుతున్నారు. మేం కూడా ఏం తీసిపోలేదంటూ డెయిరీ ఫాం వాళ్లు సిద్ధమైపోతున్నారు రేట్లు పెంచడానికి. ప్రస్తుతం మార్కెట్లో పాల ధర లీటరకు రూ.60ల వరకు ఉంది. రవాణా ఛార్జీలు పెరగడంతో ఆ భారాన్ని భరించడం కష్టమవుతోందని వాపోతున్నారు. పాల ధర పెంచడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు పాల వ్యాపారులు.

డీజిల్ ధరల పెరుగుదల కారణంగా పశువుల దాణా రేటు పెరిగింది. రైతుల నుంచి సేకరించిన పాలను విక్రయించేందుకు అయ్యే ఖర్చులు భారీగా పెరిగినట్లు పాల ఉత్పత్తి కంపెనీలు చెబుతున్నాయి. ఆ భారాన్ని ప్రజలపై వేయక తప్పదని తెలుగు రాష్ట్రాలకు చెందిన డెయిరీ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. దీంతో లీటర్‌పై కనీసం రూ.2ల వరకు పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News