August 1st : ఆగస్టు 1వ తేదీ నుంచి మారేవి ఇవే.. !

ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సేవల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Update: 2021-07-31 09:30 GMT

ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సేవల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. రేపటినుంచి (ఆదివారం)ఇవి అమల్లోకి రానున్నాయి. జరిగే స్వల్ప మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..!

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎంలలో ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.


ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు నెలకి నాలుగు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 150 రుసం చెల్లించాలి. ఇతరులు కూడా రూ. 25 వేలు మాత్రమే జమ చేయవచ్చు. డాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్‌బుక్‌కు రూ.20 చెల్లించాలి.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డోర్‌స్టెప్ సేవలకు ఛార్జీలు విధిస్తున్నట్లుగా పేర్కొంది. ఇంటి వద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు రూ. 20+GST చెల్లించాల్సి ఉంటుంది.


ఆగస్టు 1 నుంచి చమరు సంస్థలు వంట గ్యాసు ధరలు పెంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News