NVIDIA: చరిత్ర సృష్టించిన ఎన్విడియా

అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, ఆపిల్.. 5 ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ విలువ

Update: 2025-10-30 05:30 GMT

అమె­రి­కా టెక్ ది­గ్గ­జం ఎన్వి­డి­యా చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. మా­ర్కె­ట్ వి­లువ 5 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల­కు చే­రిన మొ­ట్ట­మొ­ద­టి కం­పె­నీ­గా రి­కా­ర్డు నె­ల­కొ­ల్పిం­ది. షేరు ధర దా­దా­పు 5 శాతం పె­రి­గి 201.03 వద్ద క్లో­స్ అయిం­ది. ఈ క్ర­మం­లో­మే కం­పె­నీ మా­ర్కె­ట్ క్యా­ప్ ఆల్ టైమ్ హైకి చే­రిం­ది. దీ­ని­కి గల ప్ర­ధాన కా­ర­ణా­ల్లో మొ­ద­టి­ది.. ఎన్వి­డి­యా భారీ ఒప్పం­దా­లు కు­దు­ర్చు­కో­వ­డం. ఇటీ­వ­లే ఏకం­గా  500 బి­లి­య­న్ డా­ల­ర్ల వి­లు­వైన AI చి­ప్‌ల ఆర్డ­ర్లు పొం­దిం­ది. అమె­రి­కా ఎన­ర్జీ డి­పా­ర్ట్‌­మెం­ట్ కోసం 7 సూ­ప­ర్ కం­ప్యూ­ట­ర్లు తయా­రు చే­స్తు­న్న­ట్లు ప్ర­క­టిం­చిం­ది. ఇవి అణు ఆయు­ధాల ని­ర్వ­హ­ణ­కు కూడా సహా­య­ప­డ­తా­యి. కం­పె­నీ సీఈఓ జె­న్సె­న్ హు­వాం­గ్ వా­షిం­గ్ట­న్‌­లో కొ­త్త ప్రా­డ­క్ట్‌­లు, ఒప్పం­దా­లు ప్ర­క­టిం­చా­రు. అలా­గే అమె­రి­కా అధ్య­క్షు­డు ట్రం­ప్ పా­ల­సీ­ల­ను మె­చ్చు­కు­న్నా­రు. ఎన్వి­డి­యా, ఒరా­కి­ల్ కలి­సి 1 లక్ష బ్లా­క్‌ వెల్ AI చి­ప్‌­ల­తో అతి శక్తి­వం­త­మైన సూ­ప­ర్ కం­ప్యూ­ట­ర్ తయా­రు చే­స్తు­న్నా­యి. అలా­గే ఎన్వి­డి­యా నో­కి­యా­లో 1 బి­లి­య­న్ డా­ల­ర్లు పె­ట్టు­బ­డి పె­డు­తోం­ది. రెం­డు సం­స్థ­లు కలి­సి 6G టె­క్నా­ల­జీ అభి­వృ­ద్ధి చే­స్తా­యి. ఏఐ నె­ట్‌­వ­ర్కిం­గ్, డేటా సెం­ట­ర్ల­ను మె­రు­గు­ప­రు­స్తా­యి.

అద్భుతమైన జర్నీ 

ఎన్వి­డి­యా తొ­లి­సా­రి 2023 జూ­న్‌­లో 1 ట్రి­లి­య­న్ డా­ల­ర్ మా­ర్క్ ను చే­రు­కుం­ది. ఆ తర్వాత 180 రో­జు­ల్లో­నే 2 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల కం­పె­నీ­గా ఎది­గిం­ది. ఆ తర్వాత కే­వ­లం 66 రో­జు­ల్లో­నే 3 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల మా­ర్క్ ను అం­దు­కుం­ది. 2025 జు­లై­లో­నే 4 ట్రి­లి­య­న్ డా­ల­ర్లు దా­టిం­ది. ఇప్పు­డు 5 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల మా­ర్కె­ట్ వి­లు­వ­ను చే­రు­కు­ని చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. ఎన్వి­డి­యా షే­ర్లు 6 నె­ల­ల్లో 84 శాతం రి­ట­ర్ను­లు ఇచ్చా­యి. 1 సం­వ­త్స­రం­లో 44 శాతం పె­రి­గా­యి. గత 5 సం­వ­త్స­రా­ల్లో 1,500 శాతం పె­రి­గి మల్టీ­బ్యా­గ­ర్ రా­బ­డు­లు ఇచ్చా­యి. ఇక గత 26 సం­వ­త్స­రా­ల్లో 5 లక్షల శా­తా­ని­కి పైగా పె­రి­గి ఇన్వె­స్ట­ర్ల­పై కన­క­వ­ర్షం కు­రి­పిం­చిం­ది. ప్పు­డు పె­న్నీ స్టా­క్ అయిన ఎన్వి­డి­యా ఇప్పు­డు, AI సె­క్టా­ర్లో రా­రా­జు­గా అవ­త­రిం­చిం­ది. ది­గ్గజ అమె­రి­క­న్ కం­పె­నీ­ల­ను వె­న­క్కి నె­ట్టి అగ్ర స్థా­నా­న్ని కై­వ­సం చే­సు­కుం­ది. మొ­త్తం­గా, ఎన్వి­డి­యా AI చి­ప్‌­ల­తో ప్ర­పం­చా­న్ని ఆక­ర్షి­స్తోం­ది. అమె­రి­కా-చైనా వా­ణి­జ్య యు­ద్ధం­లో­నూ ఒప్పం­దా­లు కు­దు­ర్చు­కుం­టోం­ది. ప్ర­భు­త్వ ఆర్డ­ర్లు, కొ­త్త భా­గ­స్వా­మ్యా­ల­తో 5 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల క్ల­బ్‌­లో­కి చే­రిం­ది.

తర్వాత మైక్రోసాఫ్ట్, ఆపిల్

ప్ర­స్తు­తం ఎన్వి­డి­యా ప్ర­పం­చం­లో అత్యంత వి­లు­వైన కం­పె­నీ­గా అవ­త­రిం­చిం­ది. మై­క్రో­సా­ఫ్ట్ 4 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల­తో రెం­డో స్థా­నం­లో ఉంది. మం­గ­ళ­వా­రం దీని షేరు 4 శాతం పె­రి­గి 553.72 డా­ల­ర్ల­కు చే­రిం­ది. ఇక ఆపి­ల్ కొ­త్త ఐఫో­న్ డి­మాం­డ్ వల్ల కొ­ద్ది­సే­పు 4 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల మా­ర్క్ దా­టిం­ది. కానీ.. మళ్లీ కిం­ద­కు పడి­పో­యి 3.992 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల వద్ద ము­గి­సిం­ది. ఈ ఏడా­ది ఆరం­భం నుం­చి ఏఐ రం­గం­లో వె­ను­క­బ­డిం­ద­న్న ఆం­దో­ళ­న­ల­తో ఆపి­ల్ షే­ర్లు ఇతర టెక్ ది­గ్గ­జా­ల­తో పో­లి­స్తే నె­మ్మ­ది­గా రా­ణిం­చా­యి. 2025లో ఇప్ప­టి­వ­ర­కు ఆపి­ల్ కే­వ­లం 7.5 శాతం వృ­ద్ధి సా­ధిం­చ­గా, ఇదే సమ­యం­లో ఎన్వి­డి­యా 50 శాతం, ఆల్ఫా­బె­ట్ 42 శాతం మెటా ప్లా­ట్‌­ఫా­మ్స్ 28 శాతం చొ­ప్పున లా­భ­ప­డ్డా­యి.

Tags:    

Similar News