Ola Electric Scooter: దీపావళికి ఓలా గిప్ట్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త ఉత్పత్తిని ఈ దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. భారతీయ మార్కెట్‌లో రూ. 80,000 కంటే తక్కువ ధర ఉండే కొత్త S1 వేరియంట్ అని సోర్సెస్ ధృవీకరిస్తున్నాయి.;
Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త ఉత్పత్తిని ఈ దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. భారతీయ మార్కెట్‌లో రూ. 80,000 కంటే తక్కువ ధర ఉండే కొత్త S1 వేరియంట్ అని సోర్సెస్ ధృవీకరిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో సహా S1 యొక్క చాలా ఫీచర్లను రీటైల్ చేసే అవకాశం ఉంది. కొత్త S1 వేరియంట్ Ola యొక్క MoveOS ప్లాట్‌ఫారమ్‌లో పని చేస్తుంది.
లాంచ్‌ను ధృవీకరిస్తూ, CEO భావిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు, "ఈ నెలలో లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
కొత్త Ola S1 వేరియంట్ మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది - ఎకో, నార్మల్ మరియు రైడ్. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వస్తుంది.
గత నెలలో, ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ జోరు పండుగ సీజన్‌లో కూడా కొనసాగుతుందని భావిస్తోంది.
Ola భారతదేశంలో తన పరిధిని విస్తరించింది. మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాలను తెరవడానికి కృషి చేస్తోంది.