HYDERABAD: రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్‌

దేశంలో ఎన్‌సీఆర్‌ తర్వాత మనదే ఖరీదైన నగరం.. విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లకు పెరిగిన ఆసక్తి.. రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర గృహాల కొనుగోలు;

Update: 2025-08-18 06:30 GMT

వే­గం­గా అభి­వృ­ద్ధి చెం­దు­తు­న్న హై­ద­రా­బా­ద్ నలు­మూ­ల­లా వి­స్త­రి­స్తోం­ది. ప్ర­తి ఏటా లక్షల మంది ఉపా­ధి కోసం ఈ నగ­రా­ని­కి వస్తు­న్నా­రు. అన్ని రకాల మౌ­లిక సదు­పా­యా­లు అం­దు­బా­టు­లో ఉన్న నే­ప­థ్యం­లో ఇక్క­డే స్థిర ని­వా­సం ఏర్పా­టు చే­సు­కుం­టు­న్నా­రు. ఇక్క­డే తమకు అను­వైన ఇం­టి­ని కొ­ను­గో­లు చే­స్తు­న్నా­రు. దీం­తో హై­ద­రా­బా­ద్ లో ఏ ప్రాం­తం­లో చూ­సిన ఇళ్ల­కు ఫుల్ డి­మాం­డ్ ఉంది. దీం­తో ఇళ్ల ధరలు ఆకా­శా­న్నం­టు­తు­న్నా­యి. అపా­ర్ట్‌­మెం­ట్ల నుం­చి వి­ల్లాల వరకు హాట్ కే­కు­ల్లా అమ్ము­డ­వు­తు­న్నా­యి. ఈ క్ర­మం­లో­నే హై­ద­రా­బా­ద్ నగరం దే­శం­లో­నే అత్యంత ఖరీ­దైన రెం­డో నగ­రం­గా ని­లి­చిం­ది. హై­ద­రా­బా­ద్‌ స్థి­రా­స్తి రంగం ఖరీ­దై­పో­యిం­ది. ఒక­ప్పు­డు దే­శం­లో­నే అం­దు­బా­టు ఇళ్ల ధరల మా­ర్కె­ట్‌­లో హై­ద­రా­బా­ద్‌ ముం­దు వర­స­లో ని­ల­వ­గా.. ప్ర­స్తు­తం నే­ష­న­ల్‌ క్యా­పి­ట­ల్‌ రీ­జి­య­న్‌ (ఎన్‌­సీ­ఆ­ర్‌) తర్వాత దే­శం­లో­నే అత్యంత ఖరీ­దైన రెం­డో నగ­రం­గా అభి­వృ­ద్ధి చెం­దిం­ది. ఆధు­నిక వస­తు­లు, వి­లా­స­వం­త­మైన జీవన శైలి, కొ­ను­గో­లు­దా­రుల అభి­రు­చు­ల్లో మా­ర్పు­లు, ని­ర్మాణ వ్య­యా­లు, భూ­ము­లు, ని­ర్మాణ సా­మ­గ్రి ధరల పె­రు­గు­దల వం­టి­వి నగ­రం­లో ఇళ్ల ధరల పె­రు­గు­ద­ల­కు ప్ర­ధాన కా­ర­ణా­లు­గా ని­లు­స్తు­న్నా­యి.

లగ్జరీదే మూడో వంతు వాటా

నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి-జూన్‌ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది.

ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల

కరో­నా మహ­మ్మా­రి తర్వాత నగ­రం­లో లగ్జ­రీ గృ­హాల మా­ర్కె­ట్‌ పూ­ర్తి­గా మా­రి­పో­యిం­ది. ఒక రకం­గా చె­ప్పా­లం­టే కొ­వి­డ్‌ లగ్జ­రీ ప్రా­ప­ర్టీ వి­భా­గా­ని­కి బూ­స్ట్‌ లాగా మా­రిం­ది. దీం­తో నగ­రం­లో ఏటా గృ­హాల ధరలు శర­వే­గం­గా పె­రు­గు­తు­న్నా­యి. సగటు టి­కె­ట్‌ పరి­మా­ణం పరి­శీ­లి­స్తే.. 2024 ప్రా­రం­భం­లో రూ.1.62 కో­ట్లు­గా ఉం­డ­గా.. ఇప్పు­డ­ది ఏకం­గా రూ.1.84 కో­ట్ల­కు చే­రు­కుం­ది. ఏడా­ది­లో రూ.20 లక్షల వరకూ ధరలు పె­రి­గా­యి. ఎన్‌­సీ­ఆ­ర్‌ తర్వాత దే­శం­లో రెం­డో అత్యంత ఖరీ­దైన మా­ర్కె­ట్‌­గా హై­ద­రా­బా­ద్‌ అవ­త­రిం­చిం­ది.

అందుబాటులో ఇళ్ల కొరత

నగ­రం­లో సగటు కొ­ను­గో­లు­దా­రు­కు ఇంటి యా­జ­మా­న్యం అం­దు­బా­టు­లో ఉం­డ­టం లేదు. సర­స­మైన గృ­హా­లు దా­దా­పు కను­మ­రు­గ­య్యా­యి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లా­ట్ల అమ్మ­కాల వి­లు­వ­లో కే­వ­లం 3 శా­త­మే ఉన్నా­యి. ఇవి కూడా ఎక్కు­వ­గా ఇస్నా­పూ­ర్, ఆది­భ­ట్ల, కి­స్మ­త్‌­పూ­ర్, ఘట్‌­కే­స­ర్‌ వంటి శి­వా­రు ప్రాం­తా­ల్లో­నే కేం­ద్రీ­కృ­త­మై ఉన్నా­యి. నగ­రం­లో అం­దు­బా­టు గృ­హాల కొరత తీ­వ్రం­గా ఉంది. చాలా మంది కొ­ను­గో­లు­దా­రు­లు కా­ర్యా­ల­యా­లు, పా­ఠ­శా­ల­లు, ఆసు­ప­త్రు­లు వంటి సౌ­క­ర్యా­ల­కు సమీ­పం­లో ఉన్న లగ్జ­రీ గృ­హాల వైపు మొ­గ్గు చూ­పి­స్తు­న్నా­రు. మా­దా­పూ­ర్, హై­టె­క్‌ సిటీ వంటి పశ్చిమ హై­ద­రా­బా­ద్‌­లో అపా­ర్ట్‌­మెం­ట్‌ కొ­నా­లం­టే చద­ర­పు అడు­గు ధర కని­ష్టం­గా రూ.10వే­లు­గా ఉం­డ­గా.. ఇతర ప్రాం­తా­ల­లో రూ.8 వే­లు­గా ఉం­ద­ని క్రె­డా­య్, సీ­ఆ­ర్‌ఈ మ్యా­ట్రి­క్స్‌ ని­వే­ది­క­లో వె­ల్ల­డైం­ది.

Tags:    

Similar News