పేటీఎం వినియోగదారులకు షాక్.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగింపు
గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి పేటీఎంను తొలగిచింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను కూడా తీసివేసింది.;
డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం వినియోగదారులకు షాక్ తగిలింది. గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి పేటీఎంను తొలగిచింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను కూడా తీసివేసింది. పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇది వరకే పేటీఎంకు గూగుల్ నోటీసులు జారీ చేసిందని, తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో నేచర్యలు తీసుకున్నట్లు సమాచారం.