ఇలా చేస్తే కేవలం రూ.170 కే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు...!
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.. ధరలు చూస్తేనే వణుకు పుడుతుంది.;
ఇలా చేస్తే కేవలం రూ.170 కే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు...!ఇక హైదరాబాద్‌లో అయితే గ్యాస్ సిలిండర్ ధర రూ. 870 గా ఉంది.
అయితే గ్యాస్ సిలిండర్‌ను ఇలా బుక్ చేస్తే రూ. 170 కే పొందవచ్చు... ఎలాగంటే.. ప్రముఖ పేమెంట్ యాప్ Paytm వినియోగదారులకు ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ యాప్ ఉన్నవారు.. గ్యాస్ బుకింగ్ పై రూ.700 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
ముందుగా మీరు Paytm ఓపెన్ చేసి.. రీఛార్జ్ అండ్ పే బిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మీరు వాడే సిలిండర్ కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత.. రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా మీ ఎల్‌పిజి ఐడిని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం బిల్ పే చేసి సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇలా చేసిన 24 గంటల్లో మీకు రూ. 700 వరకు విలువ కలిగిన క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు వస్తుంది. దీనిని వారం రోజుల్లో ఉపయోగించాల్సి ఉంటుంది.
అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే... పేటిఎం ద్వారా మొదటి సారి ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వారికే ఈ ఆఫర్ వరిస్తుంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.