Petrol and diesel prices : బాదుడే బాదుడు.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. !

Petrol and diesel prices : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి.

Update: 2021-10-23 03:45 GMT

Petrol and diesel prices : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 37 పైసలు, లీటర్ డీజిల్ పైన 38 పైసలు పెంచారు. దీనితో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.24కి చేరగా, డీజిల్‌ ధర రూ.95.97కు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.12, డీజిల్‌ రూ.104కు చేరుకుంది. ఇక హైదరాబాదు విషయానికి వస్తే.. లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరగా, లీటర్ డీజిల్‌ ధర రూ.104.70కు పెరిగింది. వరుసగా నాలుగురోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.1కిపైగా పెరిగాయి.. ఇక గత నెల 28 నుంచి ఈ నెల 23 వరకు 20 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంటే ఈ 20 రోజుల్లో పెట్రోల్ లీటరుకు రూ. 5 చొప్పున పెరిగగా, డీజిల్ రూ. 7 పెరిగింది.

Tags:    

Similar News